- Telugu News Photo Gallery Technology photos Google launches its virtual apparel try on tool in India
Google India: ఒక్క క్లిక్‌తో బట్టలు ట్రైల్ వేసుకోవచ్చు.. గూగుల్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్..
టెక్నాలజీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న గూగుల్.. అన్ని వర్గాలకు ఉయోగపడే టూల్స్ తీసుకొచ్చింది. ఇటీవల ఏఐ విస్తృతంగా అందుబాాటులోకి రావడంతో.. తాజాగా ఆ టెక్నాలజీతో బట్టల షాపుల యజమానులకు ఉపయోగపడేలా సరికొత్త టూల్ తీసుకొచ్చింది. ఇండియాలో తాజాగా వర్చువల్ అపెరల్ ట్రై ఆన్ టూల్‌ను లాంచ్ చేసింది.
Updated on: Dec 04, 2025 | 11:18 AM

బట్టల దుకాణం నడుపుతున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్. గూగుల్ మీ కోసం వర్చువల్ అపెరల్ ట్రై ఆన్ లైట్ టూల్‌ను ఇండియాలో కొత్తగా తీససుకొచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా దుకాణాదారులు ఒక ఫోటో లేకుండానే వర్చువల్‌గా దుస్తులను ప్రయత్నించవచ్చు. దీని ద్వారా షాపుల యాజమానులు బట్టలు ఆర్డర్ చేసేముందు తమ శరీరంపై బట్టలు ఎలా కనిపిస్తాయో దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు

టాప్స్, బాటమ్స్, డ్రెస్సులు, జాకెట్లు, బూట్లు ఎలా సరిపోతాయో వాస్తవికంగా ప్రదర్శించడానికి అప్‌లోడ్ చేసిన ఒకే ఫోటోను ఇది ఉపయోగిస్తుంది

ఈ టూల్‌ను ఉపయోగించుకోడానికి గూగుల్ మద్దతు ఇస్తున్న దుస్తుల జాబితాలో 'ట్రై ఇట్ ఆన్' ఐకాన్ కోసం వెతకాలి. ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు విభిన్న శైలిలో దుస్తులను వీక్షించవచ్చు.

గూగుల్ కస్టమ్ ఏఐ ఫ్యాషన్ మోడల్ ద్వారా ఈ టూల్ పనిచేస్తుంది. ఈ యాప్ వివిధ బట్టల ప్రవర్తనతో పాటు శరీర ఆకారాలను ఆర్ధం చేసుకుంటుంది. వేరే వేరే శరీరాలపై బట్టలు ఎలా ముడుచుకుంటాయి.. ముడతలు ఎలా పడతాయి.. ఎలా సాగుతాయి అనే డేటాను విశ్లేషిస్తుంది.




