- Telugu News Photo Gallery Technology photos Video of spy robot seen on India and China border goes viral on social media
China: భారత సరిహద్దుల్లో ‘స్పై రోబో’ కలకలం.. మనల్ని దెబ్బకొట్టేందుకు చైనా భయంకరమైన ప్లాన్..!
రాబోయే రోజుల్లో మనుషులు వర్సెస్ రోబోల మధ్య యుద్దం జరగనుందా..? భారత సరిహద్దులో చైనాకు చెందిన ఓ రోబో కనిపించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. మన సరిహద్దుల్లో చైనా ఓ స్పై రోబోను నిఘా కోసం ఉంచినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.
Updated on: Dec 04, 2025 | 1:13 PM

యుద్దాలంటే సైనికులు గన్స్‌తో ఫైరింగ్ చేయడం, క్షీపణులను వదలడం లాంటివే మనకు గుర్తుకొస్తాయి. కానీ భవిష్యత్తులో యుద్దాలు టెక్నాలజీ ద్వారానే జరగనున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తు్న్నాయి. డ్రోన్లు, రోబోట్లు వాటి ద్వారానే యుద్దాలు జరగనున్నాయని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్ధమవుతుంది.

తాజాగా భారత్-చైనా సరిహద్దులో ఒక స్పై రోబోట్ కలకలం రేపింది. ఎల్‌ఏసీ సమీపంలో చైనాకు చెందిన ఓ రోబోట్‌ను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

భారత సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి రోబోట్లను చైనా నిఘా కోసం ఉంచినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందున్న చైనా.. ఇప్పుడు సైనిక శక్తిలో కూడా రోబోట్లను విరివిగా వాడుతోంది. అత్యాధునిక డ్రోన్లు, ఆటోనమస్ వెహికల్స్ ఉపయోగిస్తోంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో ఎత్తైన ఓ ప్రాంతంలో హ్యుమనాయిడ్ రోబో ఉంది. ఈ రోబోను సరిహద్దుల్లో చైనా నిఘా కోసం ఉంచిదని, ఇది స్ప్రై రోబోగా కొంతమంది చెబుతున్నారు.

ఇక ఈ రోబో భారత భద్రతా దళాల కదలికలను ట్రాక్ చేస్తుందని మరికొంతమంది అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన మిగతా సమాచారం బయటకు రాలేదు. కానీ ఈ విజువల్స్ చేస్తూ భద్రతా పరంగా రోబోలను వాడటంలో చైనా ముందు వరుసలో ఉందని అర్థమవుతోంది.




