Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Rates: వడ్డీ రేట్లపై ఇది బంపర్ ఆఫర్.. 9.36% వడ్డీ ఇస్తున్న ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ.. వివరాలివే..

వడ్డీ ఎక్కువ వస్తోందంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు..? అందుకే 2023 ప్రారంభం నాటి నుంచే శ్రీరామ్ గ్రూప్ భారతీయ ఇన్వెస్టర్లకు ఎక్కువ రాబడి వచ్చేలా ఎఫ్‌డీ రేట్లను భారీగా ప్రకటించింది. మరి ఆ వివరాలను

FD Rates: వడ్డీ రేట్లపై ఇది బంపర్ ఆఫర్.. 9.36% వడ్డీ ఇస్తున్న ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ.. వివరాలివే..
Fd Rates
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 16, 2023 | 12:50 PM

చాలా మంది ఉద్యోగులు తాము ఉద్యోగ విరమణ తీసుకున్న తర్వాత ఇబ్బంది ఉండకూడదనే ముందు ఆలోచనతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. మరి కొంత మంది వారి పిల్లల పేరు మీద బ్యాంక్‌లలో తమ నగదు జమా చేస్తుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు అందిస్తున్నవడ్డీ రేట్లు కూడా అందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఇక వడ్డీ ఎక్కువ వస్తోందంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు..? అందుకే కొత్త ఏడాది(2023) ప్రారంభం నాటి నుంచే శ్రీరామ్ గ్రూప్ భారతీయ ఇన్వెస్టర్లకు ఎక్కువ రాబడి వచ్చేలా ఎఫ్‌డీ రేట్లను ప్రకటించింది. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త ఏడాది వడ్డీ రేట్లు:

కొత్త సంవత్సరంలో పెట్టుబడులు పెట్టే వారికి పెద్ద శుభవార్త అందించింది దేశంలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ అయిన శ్రీరామ్ గ్రూప్. ఎఫ్‌డిపై మంచి సంపాదన అవకాశాన్ని ప్రజల ముందుకు తెచ్చింది ఈ ఫైనాన్స్ కంపెనీ. కంపెనీ తన FD వడ్డీ రేట్లను భారీగా పెంచింది. శ్రీరామ్ ఫైనాన్స్ FD వడ్డీ రేట్లను 5 నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ నిర్ణయం తర్వాత.. కంపెనీ FDలపై చెల్లిస్తున్న వడ్డీ రేటు గరిష్ఠంగా 9.36 శాతానికి చేరుకుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై బంపర్ వడ్డీ:

శ్రీరామ్ ఫైనాన్స్‌లో FD చేసిన వారికి బంపర్ వడ్డీ రాబడి అందుబాటులో ఉంది. 2023 ప్రారంభంతో కొత్త వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి FDపై 9.36 శాతం వరకు వడ్డీ రాబడిని పొందటానికి సదవకాశం లభించింది. అధిక వడ్డీ కావాలనుకునేవారికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిల్లో ఇది కూడా ఒక ఉత్తమమైన ఆప్షన్ అని చెప్పుకోవాలి. FDపై వడ్డీ పెరుగుదలతో పాటు అన్ని పునరుద్ధరణలపై 0.25 శాతం అదనపు వడ్డీ కూడా అందుబాటులో ఉంటుంది

ఇవి కూడా చదవండి

మహిళలకు పెరిగిన రేట్లు:

శ్రీరామ్ ఫైనాన్స్ మారిన FD వడ్డీ రేట్ల వివరాలను వెల్లడించింది. ఆ క్రమంలోనే 12 నుంచి 60 నెలల వివిధ కాలపరిమితులకు అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లను కంపెనీ ప్రకటించింది. వీటిలో సాధారణ కస్టమర్లకు అందిస్తున్న రేట్ల కంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.50 శాతాన్ని శ్రీరామ్ గ్రూప్స్ ఫైనాన్స్ సంస్థ చెల్లిస్తోంది. అలాగే మహిళలకు FDపై 0.10 శాతం అదనపు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 12 నెలల పెట్టుబడి కాలానికి 7.30 శాతం వడ్డీని చెల్లిస్తుండగా.. 60 నెలల పెట్టుబడులపై గరిష్ఠంగా 8.45 శాతం చెల్లించేందుకు సిద్ధమైంది.

9.36 శాతం బంపర్ రిటర్న్‌స్:

శ్రీరామ్ ఫైనాన్స్ కొత్త వడ్డీ రేట్ల ప్రకారం.. మహిళా సీనియర్ సిటిజన్ తన సొమ్మును 60 నెలల కాలానికి FDగా పెట్టుబడి పెట్టినట్లయితే ఆమెకు అత్యధికంగా 9.36 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. అదెలా అంటే.. 60 నెలల FDకి సాధారణ కస్టమర్లకు 8.45 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు 50 బేసిస్ పాయింట్ల చొప్పున అంటే 8.99 శాతం వడ్డీ చెల్లించబడుతుంది. అలా మహిళా సీనియర్ సిటిజన్లు 9.36%.. (8.45% + 0.10% + 0.50% + 0.25%) ప్రయోజనం పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగారం, వెండి రెండిట్లో దేనికి ఫ్యూచర్?.. ఇన్వెస్టర్లకు అలెర్ట్
బంగారం, వెండి రెండిట్లో దేనికి ఫ్యూచర్?.. ఇన్వెస్టర్లకు అలెర్ట్
పల్లీలు చేసే హెల్త్ మ్యాజిక్ గురించి తెలుసా..?
పల్లీలు చేసే హెల్త్ మ్యాజిక్ గురించి తెలుసా..?
విలన్ రామిరెడ్డి మీకు గుర్తున్నారా.. ఈయన అచ్చం అలానే ఉన్నాడు..
విలన్ రామిరెడ్డి మీకు గుర్తున్నారా.. ఈయన అచ్చం అలానే ఉన్నాడు..
సిక్స్‌లతో శివాలెత్తిన పూరన్.. భారీ రికార్డ్‌తో ఢిల్లీ తాటతీశాడు
సిక్స్‌లతో శివాలెత్తిన పూరన్.. భారీ రికార్డ్‌తో ఢిల్లీ తాటతీశాడు
వార్నీ బుజ్జిమేక.. ఏకంగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.. !
వార్నీ బుజ్జిమేక.. ఏకంగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.. !
క్షమాపణలు చెప్పాల్సిందేనంటోన్న మంచు లక్ష్మి.. ఏమైందంటే?
క్షమాపణలు చెప్పాల్సిందేనంటోన్న మంచు లక్ష్మి.. ఏమైందంటే?
మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? జరిమానా తప్పదు..
మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? జరిమానా తప్పదు..
లివర్ ఆరోగ్యానికి ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి..!
లివర్ ఆరోగ్యానికి ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి..!
ఏంటి మీకు నచ్చానా అని ఆమె కొరియా భాషలో అడిగింది.. అతని ఆన్సర్
ఏంటి మీకు నచ్చానా అని ఆమె కొరియా భాషలో అడిగింది.. అతని ఆన్సర్
తమలపాకుతో లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
తమలపాకుతో లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!