Apple iPhone: ఐఫోన్‌ను కొనుగోలు చేశారా..? అయితే దాని ఒరిజినాలిటీని ఇలా చెక్ చేసుకోండి.. లేకపోతే అంతే సంగతీ.. !

అమితమైన ఖర్చుతో ఆపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేసే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచించన విధంగా చేస్తే మనం కొనుగోలు చేసే ఐఫోన్ ఒరిజినల్ లేదా నకిలీదా అనే విషయాన్ని ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఈ క్రమంలో..

Apple iPhone: ఐఫోన్‌ను కొనుగోలు చేశారా..? అయితే దాని ఒరిజినాలిటీని ఇలా చెక్ చేసుకోండి.. లేకపోతే అంతే సంగతీ.. !
Iphone Originality Check Up
Follow us

|

Updated on: Jan 16, 2023 | 9:47 AM

ఐఫోన్‌ను ఇష్టపడనివారుండరు. ఐఫోన్ కెమెరా క్వాలిటీ, దాని ఫీచర్లు అంటే స్మార్ట్‌ఫోన్ ప్రియులు పడిచచ్చిపోతుంటారు. అందుకే స్మార్ట్‌ఫోన్ ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో ఉంటాయి. అయినప్పటికీ ఆపిల్ ఐఫోన్‌ని సొంతం చేసుకోవాలనే కోరిక సామాన్య యువత నుంచి దిగువ మధ్యతరగతివారి వరకు చావదు. అయితే ఇదే అదునుగా భావించే స్మార్ట్‌ఫోన్ మోసగాళ్లు నకిలీ ఐఫోన్‌లను మార్కెట్‌లోకి తెచ్చి అమ్ముతుంటారు. పూర్తి విషయం తెలియక మోసగాళ్ల వద్ద ఐఫోన్‌ను కొనుగోలు చేసినవారు చివరికి మోసపోయామని తెలిసాక కన్నీరు కార్చి వదిలేస్తుంటారు. ఇలా మోసాలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  కానీ ఆకాశం ఎత్తు ధరతో ఐఫోన్‌ను కొనుగోలు చేసి చివరికి మోసపోతే ఎలా ఉంటుంది..? మీరే ఆలోచించండి.

ఆ కారణంగానే అమితమైన ఖర్చుతో ఆపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేసే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. వారు సూచించన విధంగా చేస్తే మనం కొనుగోలు చేసే ఐఫోన్ ఒరిజినల్ లేదా నకిలీదా అనే విషయాన్ని ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఈ క్రమంలో ఐఫోన్‌ ఒరిజినాలిటీని తనిఖీ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపిల్ ఐఫోన్‌ ఒరిజినాలిటీని ఎలా గుర్తించాలి..?

అసలైన Apple iPhone మోడల్‌లో ఎల్లప్పుడూ IMEI నంబర్ ఉంటుంది. IMEI నంబర్ లేకపోతే, మోడల్ నకిలీ అయ్యే అవకాశం ఉంది. మీ ఆపిల్ ఐఫోన్ IMEI నంబర్‌ను తనిఖీ చేయడానికి సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై జనరల్‌పై నొక్కండి. తర్వాత మీరు ఈ నంబర్‌ను గమనించవచ్చు. IMEI నంబర్ ఉన్నట్లయితే అది ఒరిజినల్ అని లేకపోతే మీరు మోసపోయారని అర్థం.

ఇవి కూడా చదవండి

IMEI నంబర్‌ని ఇలా చెక్ చేయండి..

iPhone ఒరిజినాలిటీ చెకప్ కోసం Apple సపోర్ట్ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయండి.ఇలా చేయడం కోసం మీ ఐఫోన్‌లోని IMEI నంబర్ అవసరం. iPhone నంబర్‌ని తెలుసుకోవడానికి, మీ ఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్లండి.ఆపై 10 అంకెల IMEI నంబర్‌ను  చూడటానికి అబౌట్‌పై క్లిక్ చేసి, క్రిందికి స్క్రోల్ చేయండి.నంబర్‌ను కాపీ చేసి, ఈ https://checkcoverage.apple.com/in/en/ Apple వెబ్‌పేజీకి వెళ్లండి. అక్కడ IMEI నంబర్‌ను పేస్ట్ చేయండి.అక్కడ మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేసిన తేదీ, మరమ్మత్తులు, సర్వీస్ కవరేజీ, టెక్నికల్ సపోర్ట్ వంటి వివరాలు ఉంటాయి. అవి ఉన్నట్లయితే మీ ఫోన్ ఒరిజినల్ అని గమనించాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..