Phone Exchange: ఎక్కువ ధరకు మీ స్మార్ట్‌ఫోన్‌‌ను ఎక్స్‌చేంజ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ తప్పులు అసలు చేయకండి..

కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలకున్నప్పుడు దాని ధరపై తగ్గింపు పొందడం కోసం మన పాత లేదా ప్రస్తుతం వాడే ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకోవచ్చు. భారత్ మార్కెట్‌లోని పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కస్టమర్లకు ఈ అవకాశాన్ని..

Phone Exchange: ఎక్కువ ధరకు మీ స్మార్ట్‌ఫోన్‌‌ను ఎక్స్‌చేంజ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ తప్పులు అసలు చేయకండి..
Smartphone Exchanging Tips
Follow us

|

Updated on: Jan 17, 2023 | 12:58 PM

కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలకున్నప్పుడు దాని ధరపై తగ్గింపు పొందడం కోసం మన పాత లేదా ప్రస్తుతం వాడే ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకోవచ్చు. భారత్ మార్కెట్‌లోని పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కస్టమర్లకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే కొన్ని సార్తు అన్‌లైన్ సెల్లింగ్ కంపెనీలు.. మంచి స్థితిలోనే  ఉన్న మీ ఫోన్‌కి చాలా తక్కువ ధరను వెల కడతాయి. అందుకు కారణం ఫోన్‌ లుక్ విషయంలో మీ అజాగ్రత్తలే ప్రధాన కారణం. మీ పాత లేదా ప్రస్తుత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్‌లో పెట్టాలనుకున్నప్పుడు అది కొత్తగా, ఇంకా ఎటువంటి రిపేర్లు లేనిదిగా కనిపించేలా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అసలు స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌చేంజ్‌ సమయంలో  ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేయాలి.. 

అన్‌లైన్ సెల్లింగ్ కోసం మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్‌ చేయాలనుకునే ముందు దానిని క్లీన్ చేయడం అసలు మర్చిపోకూడదు. లేదంటే చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే పొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మురికిగా లేదా మాసిపోయినట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం ఎక్కువ మొత్తం చెల్లించడానికి ఏ కంపెనీ సిద్ధంగా ఉండదు కదా.. అందుకే ఎల్లప్పుడు స్మార్ట్‌ఫోన్‌ని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఎక్స్‌చేంజ్ సమయంలో ఈ విషయాన్ని అసలు మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

వెనుక ప్యానెల్‌ను మార్చాలి..

చాలా సందర్భాలలో స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్న క్రమంలో దాని వెనుక ప్యానెల్‌పై గీతలు పడుతాయి. దీని ఫలితంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కూడా పాతదిగా కనిపిస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ చేసేటప్పుడు ముందు వెనుక ప్యానెల్‌ను తప్పనిసరిగా మార్చాలి. అప్పుడు మీ ఫోన్‌ కొత్తదిగా కనిపిస్తుంది. ఇంకా మీకు అధికమొత్తంలో ఎక్స్‌చేంజ్ తగ్గింపు కూడా లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌..

పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకునేటప్పుడు దాని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని గుర్తుంచుకోండి. అలా చేయడం వల్ల మీ ఫోన్ స్లోగా కాకుండా వేగంగా పనిచేస్తుంది. ఫలితంగా అన్‌లైన్ ఎక్స్‌చేంజింగ్ సమయంలో మీ ఫోన్‌కు ఎక్కువ ధర పలుకుతుంది. మంచి మొత్తంలో తగ్గింపు కూడా అందుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.