Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine: ఫ్రంట్‌ లోడ్‌ కొనలా.. టాప్‌ లోడ్‌ కొనలా.? అసలీ రెండు వాషింగ్‌ మిషన్స్‌ మధ్య తేడా ఏంటీ..

ఒకప్పుడు వాషింగ్స్‌ మిషన్స్‌ కేవలం సంపన్నుల ఇళ్లల్లోనే కనిపించేవి. కానీ మారుతోన్న కాలంతో పాటు మార్పులు వచ్చాయి. వాషింగ్‌ మిషన్స్‌ ధరలు భారీగా తగ్గడం, సంస్థలు కూడా ఈఎమ్‌ఐ అవకాశం కల్పించడంతో అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం వాషింగ్ మిషన్స్‌..

Washing Machine: ఫ్రంట్‌ లోడ్‌ కొనలా.. టాప్‌ లోడ్‌ కొనలా.? అసలీ రెండు వాషింగ్‌ మిషన్స్‌ మధ్య తేడా ఏంటీ..
Washing Machines
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 17, 2023 | 12:05 PM

ఒకప్పుడు వాషింగ్స్‌ మిషన్స్‌ కేవలం సంపన్నుల ఇళ్లల్లోనే కనిపించేవి. కానీ మారుతోన్న కాలంతో పాటు మార్పులు వచ్చాయి. వాషింగ్‌ మిషన్స్‌ ధరలు భారీగా తగ్గడం, సంస్థలు కూడా ఈఎమ్‌ఐ అవకాశం కల్పించడంతో అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం వాషింగ్ మిషన్స్‌ లేని ఇళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే వాషింగ్‌ మిషిన్స్‌లో మేజర్‌గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి టాప్‌ లోడ్‌ కాగా, మరొకటి ఫ్రండ్‌ లోడ్‌. దీంతో వాషింగ్‌ మిషన్స్‌ కొనుగోలు చేసే సమయంలో ఈ రెండింటిలో ఏది కొనుగోలు చేయాలన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి.? ఏ వాషింగ్‌ మిషన్‌ కొనుగోలు చేయడం బెటర్‌ లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల కంటే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు వాడడానికి ఈజీగా ఉంటాయి. ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్స్‌లో దుస్తులు వేయాలంటే వంగడం లేదా కాళ్లపై కూర్చోవాల్సి వస్తుంది. ఇది కొంత ఇబ్బందితో కూడుకున్న విషయం. ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్లకు సమస్యగా మారుతుంది. అదే టాప్‌లోడ్‌లో అయితే ఈ సమస్య ఉండదు. ఇక టాప్‌లోడ్‌ వల్ల మరో ప్రయోజనం.. వాషింగ్ మిషిన్‌ రన్నింగ్‌లో ఉన్న సమయంలోనూ మిషిన్‌ను మధ్యలో పాజ్‌ చేసి దుస్తులు వేయడం లేదా తీయడం చేయొచ్చు. అదే ఫ్రంట్‌లో ఇలా ఉండదు. ఒక్కసారి నీళ్లు ఎంటర్‌ అయ్యాయంటే వాష్‌ అయ్యేంత వరకు డోర్‌ ఓపెన్‌ అవ్వదు.

ఇదిలా ఉంటే టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్స్‌ దుస్తులపై కాస్త రఫ్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఓవర్‌ లోడ్‌ అయినప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది. అదే ఫ్రంట్‌ లోడ్‌లో అయితే దుస్తులపై ప్రభావం తక్కువగా పడుతుంది. ఇక ఫ్రంట్‌ డోర్‌ వాషింగ్‌ మిషన్స్‌లో డ్రయ్యర్‌ ద్వారా దుస్తులు త్వరగా ఆరిపోతాయి. టాప్‌లోడ్‌ విషయంలో సమయం ఎక్కువగా పడుతుంది. ధర విషయంలో చూసుకుంటే ఫ్రంట్‌ లోడ్‌ ధర ఎక్కువ. కానీ టాప్‌లోడ్‌ కంటే ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మిషిన్లు దుస్తులను బాగా శుభ్రం చేస్తాయి. ఫ్రంట్‌లోడ్‌ నీటిని కూడా తక్కువగా తీసుకుంటుంది. ఇక ఫ్రంట్‌ లోడ్ మిషిన్స్‌లో కొన్ని అదనపు ఫీచర్లు సైతం ఉంటాయి. చూశారుగా రెండు రకాల వాషింగ్‌ మిషిన్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌ పాయింట్స్‌, మీ అవసరాలకు అనుగుణంగా నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..