Amazon: గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌‌ను ప్రకటించిన అమెజాన్.. స్మార్ట్‌ఫోన్‌లపై అబ్బురపరిచే ఆఫర్స్ ఇవే..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Jan 18, 2023 | 9:07 AM

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా మెగా ఆఫర్ సేల్‌ను ప్రకటించింది. జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ సంస్థ..

Amazon: గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌‌ను ప్రకటించిన అమెజాన్.. స్మార్ట్‌ఫోన్‌లపై అబ్బురపరిచే ఆఫర్స్ ఇవే..
Amazon Republic Day Sale 2023 Smartphones

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా మెగా ఆఫర్ సేల్‌ను ప్రకటించింది. జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ సంస్థ ‘అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ని నిర్వహిస్తోంది. జనవరి 15 నుంచి కొనసాగుతున్న ఈ స్పెషల్ సేల్ ఈవెంట్ జనవరి 20న ముగుస్తుంది. ఈ ఆఫర్ల కింద స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, హోమ్ యాక్సెసరీస్ వంటి ప్రొడక్ట్స్‌ను అదిరిపోయే ఆఫర్స్‌లో పొందవచ్చు. ఇక టాప్ బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై కూడా అమెజాన్ బెస్ట్ డీల్స్‌, ఆఫర్స్ అందిస్తోంది. మరి ఈ ఆఫర్‌ ద్వారా పొందగలిగే టాప్ 5 బ్రాండ్ ఫోన్‌లేమిటో ఇప్పుడు చూద్దాం..

  1. Samsung Galaxy M32 Prime: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో Samsung Galaxy M32 Prime స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.9,899 డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. రియర్ క్వాడ్ కెమెరా సెటప్‌తో ఉన్న ఈ ఫోన్‌లో 64MP (F 1.8) ప్రైమరీ కెమెరా, 8MP (F2.2) అల్ట్రా వైడ్ కెమెరా, 2MP (F2.4) డెప్త్ కెమెరా, 2MP (2.4) మాక్రో కెమెరా ఇందులో ఉన్నాయి. ఇంకా ఫోన్ ముందు భాగంలో 20MP (F2.2) ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అలాగే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థం 6,000mAh కావడం దీనికి ఉన్న మరో ప్రత్యేకత.
  2.  Redmi A1: Redmi A1 రెండు వేరియంట్లతో మార్కెట్‌లో లభిస్తుంది. 3GB RAM +32GB బేస్ వేరియంట్ ధర రూ.7,499. మరో వేరియంట్ 4GB RAM + 64GB ధర రూ.8,299. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ హ్యాండ్‌సెట్‌పై బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G25 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ సెన్సార్‌ వంటివి ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.
  3. Techno Spark 9: గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో టెక్నో స్పార్క్ 9పై బెస్ట్ డీల్ పొందవచ్చు. అన్ని ఆఫర్స్ కలుపుకుని ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.7019లకే మీ సొంతం చేసుకోవచ్చు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ 6.6 అంగుళాల డాట్ నాచ్ డిస్‌ప్లేతో లభిస్తుంది. అలాగే ఇది మీడియాటెక్ హీలియో G37 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ HiOS 8.6తో డివైజ్ రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్యాటరీ సామర్థ్యం 52,000mAh.
  4. Realme Narzo 50: రియల్‌మీ‌ కంపెనీకి చెందిన ఈ బడ్జెట్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ Realme Narzo 50 హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ హీలియో G96 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌‌తో  పాటు 33వాట్ డార్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ కూడా ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉన్న ఈ డివైజ్‌లో 50MP మెయిన్ కెమెరా ఉంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రియల్‌మీ నార్జో 50‌పై బెస్ట్ డీల్ పొందవచ్చు. ప్రస్తుతం రూ.11,900కు లభిస్తున్న ఈ మోడల్‌పై బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు.
  5. ఇవి కూడా చదవండి

  6. Samsung Galaxy M04: మీడియాటెక్ హీలియో P35 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే Samsung Galaxy M04 ఆండ్రాయిడ్ 12 బేస్డ్ One UI కోర్ 4.1 ఓఎస్‌తో రన్ అవుతుంది. 6.5 అంగుళాల LCD స్క్రీన్ 720 x 1600 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్‌తో డిస్‌ప్లేను ఇది కలిగిఉంది. రూ.8,999 ధర ఉన్న ఈ ఫోన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా రూ.7499కే కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu