Pranitha Subhash: కూతురిని తలుచుకొని ఎమోషనల్ అయిన ప్రణీత.. విడిచి ఉండాల్సి వచ్చిందంటూ..

కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ప్రణీత పెళ్లి చేసుకుంది. ఇటీవలే బిడ్డకు కూడా జన్మనించింది ఈ బ్యూటీ. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రణీత.

Pranitha Subhash: కూతురిని తలుచుకొని ఎమోషనల్ అయిన ప్రణీత.. విడిచి ఉండాల్సి వచ్చిందంటూ..
Pranitha Subhash 3.
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 31, 2023 | 9:13 AM

ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్యూట్ బ్యూటీ ప్రణీత సుభాష్. పాలరాతి శిల్పంలా మెరిసిపోయే ఈ భామ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అయితే ఆ అమ్మడుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రణీత సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే పవన్ తో కలిసి ఒక డ్యూయట్ లోనూ స్టెప్పులేసింది. దాంతో ఈ భామ మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ప్రణీత పెళ్లి చేసుకుంది. ఇటీవలే బిడ్డకు కూడా జన్మనించింది ఈ బ్యూటీ. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రణీత. ఇటీవలే ప్రణీత పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత పూర్తిగా తన టైం ను తనతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. పాప ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రణీత కూతురిని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. ప్రణీత ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దిలీప్ హీరోగా నటిస్తున్నారట. మలయాళంలో తొలిసారిగా నటిస్తోంది ప్రణీత.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రణీత మాట్లాడుతూ.. మాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు చాలా  ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో ఈగో ఉన్న యువతి రోల్ లో నేను కనిపిస్తానని ప్రణీత చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీ డబ్బింగ్ చెప్పడం ఛాలెంజ్ గా అనిపించిందని అన్నారు. నేను అమ్మ అయిన తర్వాత ఒప్పుకున్న తొలి మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ షూటింగ్ వల్ల .. నా కూతురు ఆర్నాకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఎమోషనల్ అయ్యింది.