Cardamom Benefits: ఈ 7 సమస్యలకు చెక్ పెట్టాలంటే ఏలకులను తినాల్సిందే.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా..
ఆధునిక జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఏలకులు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే.. మన శరీరానికి..
వంటి గదిలో లభించే సుగంధ ద్రవ్యాలలో ఏలకులకు ప్రత్యేకత ఉంది. పూర్వ కాలం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించే ఏలకుల వాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. ఆధునిక జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఏలకులు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే.. మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాక పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. ఏలకులను చాలామంది మౌత్ ఫ్రెష్‌నర్‌గా తింటారు. వీటిని నమలడం వల్ల మన నోరు మొత్తం పూర్తిగా తాజాగా మారుతుంది. యాలకులలో విటమిన్ B6, విటమిన్ B3, విటమిన్ C, జింక్, కాల్షియం, పొటాషియం అలాగే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉన్నాయి. నోటి దుర్వాసనకు కారణమయ్యే క్రిములతో పోరాడడంలో కూడా ఏలకులు సహాయపడతాయి. ఇంకా ఏలకుల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- గుండె ఆరోగ్యం: ఏలకులను రోజూ తీసుకుంటే గుండె పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గుండెపోటు, పలు సమస్యలను నివారించడానికి మీరు రోజూ రెండు లేదా మూడు ఏలకులను తినవచ్చు.
- రక్తపోటు: అధిక రక్తపోటు, ఉబ్బసం, అజీర్ణం వంటి అనేక వ్యాధులకు ఏలకులు అద్భుతమైన ఔషధం. ఏలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
- మెరుగైన లైంగిక జీవితం: ఏలకులు పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి పురుషుల జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకువస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల సెక్స్ పట్ల కోరిక పెరిగి భాగస్వామికి చాలా దగ్గరవుతారు. అందువల్ల పురుషులు తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ ఏలకులను తీసుకుంటే మంచిదంటున్నారు.
- కాలేయ వ్యాధులకు చెక్: ఏలకులు ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాలేయం, బరువు పెరగడాన్ని నివారించడంలో ఏలకులు సహాయపడతాయి. ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్‌లు, ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, ఫ్యాటి లివర్ ప్రమాదాన్ని నివారించడంలో కూడా ఇవి ఉపకరిస్తాయి.
- కిడ్నీల పనితీరులో మెరుగు: ఏలకులు కిడ్నీల ద్వారా వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కాల్షియం, యూరియా, టాక్సిన్‌లను తొలగించి.. మూత్రశాయాన్ని డిటాక్స్ చేస్తాయి.
- బెల్లీ ఫ్యాట్: పొట్టకు ఏలకులు చాలా మేలు చేస్తాయి. పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడంలో యాలకులు సహకరిస్తాయి.
- నోటి దుర్వాసన: ఏలకులు నోటి దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేయడంతో పాటు దంతాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల నోటి నుంచి దుర్వాసనలకు బదులుగా సువాసనలు వస్తాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..