Dates for Diabetes: షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఖర్జూరాలు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో తెలుసా..

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఖర్జూరం తీసుకోవచ్చో.. లేదో అనే సందేహం ఉంది. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..

Dates for Diabetes: షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఖర్జూరాలు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో తెలుసా..
Dates for Health
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 01, 2023 | 6:35 PM

క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి6, కె, నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. వంటి పోషకాలు ఖర్జూరం పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం పండు తింటే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిలోని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్ పోషకాలు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా బీపీ కంట్రోల్‌లో ఉంచుతుంది. కార్డియో వాస్కులర్ సమస్యలున్నవారికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తనిడం వల్ల కార్డియో వాస్కులర్ సమస్య దరి చేరదు. వీటిల్లో పొటాషియం తక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకుంటే ఈ సమస్య ఉండదు. ఐతే డయాబెటిస్ ఉన్నవాళ్లు ఖర్జూరం తీసుకోవచ్చో.. లేదో అనే సందేహం ఉంది. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..

డయాబెటీస్ ఉన్నవారికి ఖర్జూరం తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా రక్తంలో చక్కెర ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వారు ఖర్జూరాలు తింటే.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. ఖర్జూరం తినడానికి తియ్యగా ఉండడం వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లు ఖర్జూరం అస్సలు తీసుకోకూడదు అని చాలా మంది అనుకుంటారు. ఐతే తక్కువ మోతాదులో వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. మోతాదుకు మించితిన్నారంటే మాత్రం తిప్పలు తప్పవు. వ్యాయామానికి ముందు, రాత్రి నిద్రపోయే ముందు, అలాగే బ్రేక్‌ ఫాస్ట్‌లో ఖర్జూరాలను తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.