AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల వరకు లోన్..

డ్వాక్రా మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులో భాగంగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఏపీలో డ్వాక్రా మహిళలు రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేకుండా లోన్ పొందవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ఏపీలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల వరకు లోన్..
Womens
Venkatrao Lella
|

Updated on: May 25, 2026 | 12:54 PM

Share

ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. రూ.10 లక్షల వరకు మహిళలకు రుణం మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులైన డ్వాక్రా మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళలు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కూడా ఈ లోన్ మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చి ఐఈఎల్‌ఏ విధానం ద్వారా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వీటి కోసం మాత్రమే..

డ్వాక్రా మహిళలు కొత్తగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకుంటే ఈ రుణం తీసుకొవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ అనుబంధమైన యూనిట్ల కోసం లోన్ ఇస్తారన్నారు. పుట్టగొడుగుల ఉత్పత్తి, తేనె, మునగ, నర్సరీలు, సోలార్ డ్రయ్యర్లు, చేపలు, రక్షిత సాగు వంటి ప్రాసెసింగ్ యూనిట్లకు ఈ రుణం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన డ్వాక్రా మహిళలందరూ ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీపీఆర్ తయారీ, దరఖాస్తు విధానంలో సెర్ప్ శాఖలోని వెలుగు విభాగం అధికారులు సహాయసహకారాలు అందిస్తారని అన్నారు. మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు ఈ రుణాలు తోడ్పాటు అందిస్తాయని స్పష్టం చేశారు.

టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు

ఇక రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఏపీ ఎస్‌ఎంఈలు ఎక్సేంజ్ ఏర్పాటు అవకాశాలు పరిశీలించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చిన్న, మధ్యతరగతి కంపెనీల ఐపీవోలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎంఈలకు ఈక్విటీ, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. కాగా డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.  అందులో భాగంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది.  ఇక కేంద్రంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రత్యకంగా రుణాలు మంజూరు చేస్తోంది. డ్వాక్రా సంఘాల మహిళలు తమ కుటుంబంలోని పిల్లల విద్య, పెళ్లి అవసరాల కోసం ప్రభుత్వం రుణాలు విడుదల చేస్తోంది.

Follow Us