BBC Documentary Row: బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్‌పై రుగులుకున్న వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002 గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లపై రూపొందించిన వివాదాస్పదమైన బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్‌ చేయడంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే..

BBC Documentary Row: బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్‌పై రుగులుకున్న వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
BBC documentary row
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 30, 2023 | 3:58 PM

ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002 గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లపై రూపొందించిన వివాదాస్పదమైన బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్‌ చేయడంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దేశంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా కేంద్రం అడ్డుకోవడంపై దాఖలైన ఈ పిటీషన్‌ను విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం సోమవారం (జనవరి 30) అంగీకరించింది. పిల్‌ను ఫిబ్రవరి 6న జాబితా చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ముందు బీబీసీ డాక్యుమెంటరీ పార్ట్‌-1, 2 విచారణ కోసం అడ్వకేట్ ఎంఎల్ శర్మ పిటిషన్‌ను దాఖలు చేశారు.

శర్మ తన పిల్‌లో రాజ్యాంగబద్ధమైన ప్రశ్నను లేవనెత్తానన్నారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వార్తలు, వాస్తవాలు, నివేదికలపై రూపొందిచిన బీబీసీ డాక్యుమెంటరీ చూడడానికి ఆర్టికల్ 19 (1) (2) ప్రకారం పౌరులకు హక్కు ఉందో.. లేదో.. సుప్రీంకోర్టు నిర్ణయించాలని శర్మ అన్నారు. ఈ డాక్యుమెంటరీలో రికార్డు చేసిన వాస్తవాలు సాక్ష్యంగా పనికి వస్తాయని, బాధితులకు న్యాయం జరిగేందుకు ఉపయోగించవచ్చని పిటీషన్‌లో పేర్కొన్నారు. వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’కు సంబంధించిన లింకులున్న యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్‌లను బ్లాక్ చేయాలని జనవరి 21న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ డాక్యుమెంటరీని చూసిన పౌరులు, విద్యార్ధులను కేంద్రం అరెస్టు చేస్తున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జనవరి 21న ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరారు. దీనిని సుప్రీం కోర్టు వచ్చే సోమవారం విచారించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.