అమెరికాలో ఉద్యోగం అంతలోనే పెను విషాదం.. జాబ్‌లో చేరిన 3 రోజులకే శ్రీకాకుళం యువకుడు మృతి!

ఉద్యోగం వచ్చిందని ఎంతో ఉత్సాహంగా సొంతూరు నుంచి అమెరికాకు వెళ్లాడా యువకుడు. పెద్ద ఉద్యోగం చేసి మమ్మల్ని బాగా చూసుకుంటాడని యువకుడి తల్లీదండ్రులు పొంగిపోయారు. కానీ ఎంతో సేపు ఆ సంతోషం నిలవలేదు. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే..

అమెరికాలో ఉద్యోగం అంతలోనే పెను విషాదం.. జాబ్‌లో చేరిన 3 రోజులకే శ్రీకాకుళం యువకుడు మృతి!
Srikakulam Man Died In America
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 27, 2023 | 7:17 PM

ఉద్యోగం వచ్చిందని ఎంతో ఉత్సాహంగా సొంతూరు నుంచి అమెరికాకు వెళ్లాడా యువకుడు. పెద్ద ఉద్యోగం చేసి మమ్మల్ని బాగా చూసుకుంటాడని యువకుడి తల్లీదండ్రులు పొంగిపోయారు. కానీ ఎంతో సేపు ఆ సంతోషం నిలవలేదు. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే మృత్యువు అతన్ని కబలించింది. శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి చెందిన రవికుమార్‌కు ఇటీవల అమెరికాలో ఉద్యోగం వచ్చింది. దీంతో జనవరి 17న కొత్త ఉద్యోగంలో చేరేందుకు అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అక్కడ సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు. ఇంతలో బుధవారం నాడు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కంటెయినర్‌ పైనుంచి జారిపడి రవికుమార్ మృతి చెందాడు.

రవికుమార్‌ మృతిపై అతని కుటుంబ సభ్యులకు గురువారం కంపెనీ ప్రతినిధులు సమాచారం చేరవేశారు. దీంతో ఎదిగిన కుమారుడు అంతలోనే అందకుండా పోయినందుకు రవికుమార్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రవికుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మృత దేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు. కాగా విద్యా, ఉపాది నిమిత్తం దేశాలకు వెళ్లిన యువత ఇటీవల కాలంలో వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. నాలుగు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్వవి అనే విద్యార్థిని అమెరికాలో మృతిచెందిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?