Nara Lokesh: జగన్ సర్కార్‌పై విరుచుకు పడిన నారా లోకేష్.. యువతకు ‘ప్రత్యేక మానిఫెస్టో’ హామీ అంటూ..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా | Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2023 | 3:46 PM

యువగళం పేరు ప్రకటించగానే వైకాపా నాయకులకు వణుకు పుట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 4వేల కి.మీ మేర సాగే యువగళం పాదయాత్రను..

Nara Lokesh: జగన్ సర్కార్‌పై విరుచుకు పడిన నారా లోకేష్..  యువతకు ‘ప్రత్యేక మానిఫెస్టో’ హామీ అంటూ..
Nara Lokesh Yuva Galam Public Meet At Kuppam

యువగళం పేరు ప్రకటించగానే వైకాపా నాయకులకు వణుకు పుట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 4వేల కి.మీ మేర సాగే యువగళం పాదయాత్రను శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నుంచి లోకేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘యువగళం పాదయాత్ర ప్రకటించగానే  10మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు.  గతంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశాను. ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నా. నన్ను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నా.. ఈ మూడేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు. . వీధుల్లో డ్యాన్సులు వేస్తే, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావ’ని అన్నారు.

ఇంకా లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలోనే తెలుగు జాతి గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కృషి చేశారు. ఆంధ్రుల సత్తా ఏమిటో చంద్రబాబు చేసి చూపించారు. కానీ, ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ మూడేళ్లలో వైకాపా చేసిందేమిటి..? జగన్‌రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నాడు. మైసూర్‌ బోండాలో మైసూర్‌ ఉండదు.. జాదూరెడ్డి జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్నారు. ఏమయ్యాయి ఉద్యోగాలన్నీ..? ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు ఏమైంది..? మెగా డీఎస్సీ ఏమైందని జాదూరెడ్డిని ప్రశ్నిస్తున్నా’ అని దుయ్యబట్టారు.

నారా లోకేష్ పబ్లిక్ మీటింగ్ ప్రసంగాన్ని ఇక్కడ చూడండి.. 

ఇవి కూడా చదవండి


ఇంకా ‘దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జాదూరెడ్డి.. దిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. దానికి కారణం నీపైన ఉన్న కేసులే. యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం బాధితులే. ఈ  మూడేళ్లలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి? పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. జే ట్యాక్స్‌ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడని ప్రగల్భాలు పలికారు. కానీ, అది బుల్లెట్లు లేని గన్‌ అని ప్రజలకు అర్థమైంది’’ అని లోకేశ్‌ విమర్శించారు.

త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో..

యువగళం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో యువతను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతూ ‘యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తాం. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటాం. ప్రభుత్వ వైఫ్యలాలను విమర్శిస్తే.. నాకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారు. పంపించండి చీర, గాజులు.. మా అక్కలు, చెళ్లెల్లకు ఇస్తా. చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతగానివాళ్లా..? అని అడుగుతున్నా’నని అన్నారు.

ఇంకా ‘మీ జగన్‌ మాదిరిగా తల్లీ, చెల్లిని బయటకు గెంటలేదు. మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఏ1 తెచ్చిన జీవో1తో అడ్డుకోవాలని చూస్తారా? పవన్‌ కల్యాణ్‌ పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. పవన్‌ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారు. యువగళం ఆగదు, వారాహి ఆగదు. భయం నా బయోడేటాలోనే లేదు. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతాం. మంచి కోసం పోరాడే ధైర్యం ఉంది. సైకో పాలనలో అప్పులు.. ఆత్మహత్యలు. సైకిల్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరోజు. నిరుద్యోగ యువతకు పిలుపినిస్తున్నా.. కలిసికట్టుగా ఉద్యమించి జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం’’ అని లోకేశ్‌ ప్రసంగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu