Maharashtra: మరాఠా రాష్ట్రానికి గవర్నర్ కాబోతున్న పంజాబీ..? కెప్టెన్ అమరీందర్ సింగ్‌కే అవకాశమంటున్న అధికార వర్గాలు..
మహారాష్ట్ర గవర్నర్‌గా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోషియారి..
మహారాష్ట్ర గవర్నర్‌గా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోషియారి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన స్థానాన్ని కెప్టెన్‌తో భర్తీ చేయనున్నట్లు అధికార వర్గాలలో చర్చ సాగుతోంది. గవర్నర్‌గా తన పదవీకాలంలో పలుమార్లు విపక్షాల విమర్శలు, రాజీనామా చేయాలన్న డిమాండ్లను ఎదుర్కొన్న కోషియారి.. ఇప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన గత సోమవారం తెలియజేశారు.
అయితే గతేడాది సెప్టెంబర్ 19న బీజేపీ తీర్థం పుచ్చుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్.. తన పంజాబ్ లోక్ కాంగ్రెస్-పీఎల్సీని బీజేపీలో విలీనం చేశారు. పటియాలా నుంచి శాసనసభకు ఎన్నికైన ఆయన పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2002 నుంచి 2007 వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి పాటియాలా సంస్థానానికి చివరి మహారాజు. 2014 లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ స్థానం నుంచి గెలుపొందారు కెప్టెన్. 2021 సెప్టెంబర్ 18న పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ సింగ్ రాజీనామా చేశారు. సిద్ధుతో విభేదాల కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..