Andhra Pradesh: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. అహోబిలం పిటీషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం..

జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూల్ జిల్లాలోని అహోబిలం మఠానికి సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్..

Andhra Pradesh: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. అహోబిలం పిటీషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం..
Supreme Court On Ahobilam Case
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 27, 2023 | 3:29 PM

జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూల్ జిల్లాలోని అహోబిలం మఠానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. మఠం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అహోబిలం మఠానికి ఈవో నియామకాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ రోజు(జనవరి 27) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పును సమర్థించింది.

ఇంకా మఠానికి సంబంధించిన సాధారణ కార్యకలాపాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని.. మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డిని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎఎస్‌ ఓఖా ధర్మాసనం ప్రశ్నించింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని.. అందులో జోక్యం చేసుకోవద్దని కూడా ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..