Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. బీబీసీ డాక్యుమెంటరీ vs కశ్మిరీ ఫైల్స్..

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో హైడ్రామా చోటు చేసుకుంది. రెండు చిత్రాల ప్రదర్శన కోసం యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య..

Hyderabad: హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. బీబీసీ డాక్యుమెంటరీ vs కశ్మిరీ ఫైల్స్..
Hcu Student Unions Clash
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 26, 2023 | 9:02 PM

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో హైడ్రామా చోటు చేసుకుంది. రెండు చిత్రాల ప్రదర్శన కోసం యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య వామపక్ష విద్యార్థి సంఘం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI) కార్యకర్తలు బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించారు. లేడీస్‌ హాస్టల్‌లో ఈ డాక్యుమెంటరీని ప్లే చేశారు. అదే సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు కశ్మీర్‌ ఫైల్స్ సినిమాను నార్త్ బ్లాక్‌లో చూపించారు. భారత ప్రభుత్వం నిషేధించిన ఈ డాక్యుమెంటరీని యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించడం సరికాదంటూ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఏబీవీపీ కార్యకర్తలు.

అంతకు ముందు కాసేపు హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీబీసీ వీడియో ప్లే చేసేందుకు SFI విద్యార్థుల సిద్ధమవ్వగా.. పోటీగా కశ్మీర్‌ఫైల్స్‌ ప్రదర్శించేందుకు ABVP నేతలు ప్రయత్నించారు. అయితే ఏబీవీపీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో హైటెన్షన్ క్రియేట్ అయ్యింది. వర్సిటీ యాజమాన్యం లెఫ్ట్‌ యూనియన్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ABVP కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భద్రత పెంచారు.

ఇవి కూడా చదవండి

కాగా, బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని భారత్‌లో ప్రదర్శించవద్దని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే దానిని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మరికొన్ని యూనివర్సిటీలలోన ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించే యత్నాలు జరగడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..