AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జగిత్యాల BRSలో శ్రావణి రాజీనామా ప్రకంపనలు.. స్థానిక ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శ్రావణి రాజీనామా BRS(భారత రాష్ట్ర సమితి)లో కలకలం రేపుతోంది. శ్రావణి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను టార్గెట్‌ చేయడం..

Telangana: జగిత్యాల BRSలో శ్రావణి రాజీనామా ప్రకంపనలు.. స్థానిక ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు..
Jagtial Municioal Chairperson Sravani; Local Mla Sanjay Kumar
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 26, 2023 | 3:32 PM

Share

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శ్రావణి రాజీనామా BRS(భారత రాష్ట్ర సమితి)లో కలకలం రేపుతోంది. శ్రావణి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను టార్గెట్‌ చేయడం, మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం అధికార పార్టీలోని స్థానిక నాయకులలో హీట్‌ పుట్టిస్తోంది. బుధవారం(జనవరి 25) తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ కుమార్ ఉద్వేగంగా మాట్లాడారు. ఆ క్రమంలోనే  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఆమె మాట్లాడుతూ ‘‘దొరగారూ మీకో దండం. మూడేళ్లుగా అడుగడుగునా అవమానాలు, వేధింపులు భరించా. ఇక నా వల్ల కాదు, మీ గడీ సంకెళ్లు తెంపుకుని బయటికి వస్తున్నా..నా కుటుంబాన్ని, పిల్లల్ని కాపాడుకునేందుకే రాజీనామా చేస్తున్నా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగాను. ఇక ఈ నరకం నా వల్ల కాదు. దొరా మీరే గెలిచారు..’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ‘ఒక మహిళా బీసీ నేతగా జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మూడు నెలల పసిగుడ్డును వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. కేటీఆర్, కవిత ఆశీస్సులతో బలహీనవర్గాలకు చెందిన నేను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి పొందగలిగా. కానీ ప్రమాణ స్వీకారం చేసిన రెండోరోజు నుంచే విషం చిమ్మే కోరలు ఉన్న మనుషుల మధ్య పనిచేయాల్సి వచ్చింది. ‘మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి అంటే ముళ్లకిరీటం’ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ చెబితే తన తండ్రిలాంటి వాడు, తన బాగు కోసం సలహాలు ఇస్తున్నాడని భావించానే తప్ప.. ఆయన రాక్షసత్వానికే బలవుతానని అనుకోలేదు..’ అని శ్రావణి అన్నారు.

శ్రావణి చేసిన ఆరోపణలపై స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే: 

తనను ఉద్దేశించి జగిత్యాల చైర్‌పర్సన్ భోగ శ్రావణి చేసిన ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించి మాట్లాడారు. శ్రావణి చేసిన ఆరోపణల వెనక విపక్షాల కుట్ర ఉందన్నారు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌. ఆమె ప్రెస్‌మీట్‌ను బీజేపీ ఎంపీలు.. ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అయితే, ఆమె రాజీనామాపై హైకమాండ్‌డే తుది నిర్ణయం అని తెలిపిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌..  శ్రావణికి బీఫామ్ ఇచ్చిందే తానని అన్నారు. ‘చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి ఆరోపణలు సమంజసం కాదు. ఆమెకు బీఫామ్‌ ఇచ్చిందే నేను. అలాంటిది నేను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాను. అవిశ్వాసం విషయంలో నా ప్రమేయం లేదు. ఈ విషయంలో ఇంతకుమించి స్పందించలేను’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..