Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanha Music Fest: ప్రముఖ జానపద సంగీత కళాకారుడు రాహుల్ శర్మ.. సంతూర్‌ని రాక్ జానర్‌లోకి తీసుకెళ్లి వినూత్న ప్రయోగాలు

నేడు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ చెందిన సంగీత విద్వాంసులు.. సంతూర్ ప్లేయర్  రాహుల్ శర్మ తన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ రోజు సంగీత ప్రియులను తన సంతూర్ ప్లేయర్ తో అలరించనున్నారు రాహుల్ శర్మ.

Kanha Music Fest: ప్రముఖ జానపద సంగీత కళాకారుడు రాహుల్ శర్మ.. సంతూర్‌ని రాక్ జానర్‌లోకి తీసుకెళ్లి వినూత్న ప్రయోగాలు
rahul sharma, santoor player
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2023 | 6:45 AM

హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో శ్రీరామ చంద్ర మిషన్ ఆది గురువు లాలాజీ మహారాజ్ 150వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ జయంతి వేడుకల్లో మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ సంగీత కళారాధనలో రోజుకు ఒక సంగీత విద్వాంసులు తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ చెందిన సంగీత విద్వాంసులు.. సంతూర్ ప్లేయర్  రాహుల్ శర్మ తన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ రోజు సంగీత ప్రియులను తన సంతూర్ ప్లేయర్ తో అలరించనున్నారు రాహుల్ శర్మ. ఈ రోజు జానపద సంగీత కళాకారుడు సంతూర్ ప్లేయర్ రాహుల్ శర్మ గురించి తెలుసుకుందాం..

రాహుల్ శర్మ మహారాష్ట్రలోని ముంబైలో 25వ తేదీ సెప్టెంబర్ 1972న శివకుమార్ శర్మ , మనోరమ దంపతులకు జన్మించారు. జమ్మూ కశ్మీర్ సంప్రదాయానికి చెందిన డోగ్రా కుటుంబానికి చెందినవారు. రాహుల్ శర్మ తాత.. ఉమా దత్ శర్మ..  సంతూర్ ప్లేయర్. రాహుల్ చిన్న వయసులోనే హార్మోనియం వాయించడం ప్రారంభించారు. 13 సంవత్సరాల వయస్సులో సంతూర్ నేర్చుకున్నారు. అయితే తాను పూర్తిస్థాయిలో సంగీతాన్ని కొనసాగించాలని 17 ఏళ్లు వచ్చే వరకు అనుకోలేదు. ముంబైలోని మిథిబాయి కాలేజీలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం.. రాహుల్ శర్మ తన తండ్రితో కలిసి ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. 1996లో తన 24వ ఏట తండ్రితో పాటు కచేరీల్లో పాల్గొనడం ప్రారంభించారు. 2009లో తన ప్రియురాలు బర్ఖా శర్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 17 జూన్ 2014న జన్మించిన అభినవ్ అనే కుమారుడు ఉన్నాడు

రాహుల్ శర్మ WOMAD, దర్బార్ ఉత్సవంలో ప్రదర్శన ఇవ్వడానికి పీటర్ గాబ్రియేల్ తో ఎగ్రిమెంట్ చేసుకున్నారు. తన తండ్రి శివకుమార్ శర్మ నుండి సంతూర్.. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న రాహుల్.. తన తోటి కళాకారుల సహకారాలతో సంతూర్‌ని ప్రపంచ సంగీత యవనిక పై నిలబెట్టారు. రాహుల్, అమెరికన్ శాక్సోఫోన్ వాద్యకారుడు కెన్నీ G ఆల్బమ్ బిల్‌బోర్డ్ వరల్డ్ చార్ట్‌లలో 2 , బోర్డ్ స్మూత్ జాజ్ చార్ట్‌లలో సంగీతాన్ని ఓ రేంజ్ లో తీసుకుని వెళ్లారు. భారతీయ జానపద , సంతూర్‌లను… ఎరిక్ మిక్వెట్ స్థాపించిన రాహుల్ గ్రామీ-విజేత ఎలక్ట్రానిక్ గ్రూప్ డీప్ ఫారెస్ట్‌తో జతకట్టారు. రాహుల్ తన ఆల్బమ్ ది రెబెల్‌తో సంతూర్‌ని రాక్ జానర్‌లోకి తీసుకొని వినూత్న ప్రయోగాలు చేశారు.

ఇవి కూడా చదవండి

రాహుల్ కొన్ని సోలో, కొన్ని తన తండ్రితో కలిసి అనేక అనేక CD లు విడుదల చేశారు. అతను పియానిస్ట్ రిచర్డ్ క్లేడెర్మాన్ , కీబోర్డు వాద్యకారుడు కెర్సీ లార్డ్ వంటి అంతర్జాతీయ సంగీతకారులతో కలిసి పనిచేశారు. హిందీ సినిమా ముజ్సే దోస్తీ కరోగేకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు గాను బాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో “బెస్ట్ డెబ్యూ – మ్యూజిక్ డైరెక్టర్” విభాగంలో అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలోని సంగీతం.. టైమ్ ట్రావెలర్ .. ఇది న్యూ ఏజ్ గా వర్ణించబడింది. జాకీర్ హుస్సేన్ , జాన్ మెక్‌లాఫ్లిన్ , మిక్కీ హార్ట్ , జార్జ్ హారిసన్ , యో యో మా , జో హెండర్సన్ , వాన్ మోరిసన్ , ఎయిర్టో మోరీరా , ఫారోహ్ సాండర్స్ ,  కోడో డ్రమ్మర్స్ వంటి సంగీతకారులతో కలిసి పనిచేశారు రాహుల్. తన భార్య బర్ఖా శర్మ తో కలిసి అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2019లో అతని తండ్రి యోగేష్ సంసితో కలిసి బార్బికన్ సెంటర్‌లో ప్రదర్శన ఇచ్చారు. రాహుల్ శర్మ 60 కంటే ఎక్కువ ఆల్బమ్‌లను ఇప్పటి వరకూ రిలీజ్ చేశారు. తన సంగీతంతో సంగీత ప్రియులను అలరిస్తున్న రాహుల్ శర్మ అనేక అవార్డులు, సంగీత ప్రియుల  ప్రశంసలను అందుకున్నారు. రాహుల్ శర్మకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..