Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokesh Padayatra: నారాలోకేష్ పాదయాత్రకు అంతా రెడీ .. తొలిరోజు బాలకృష్ణ హాజరు.. 400 రోజులు, 4వేల కి.మీ.సాగనున్న యాత్ర

టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో యువగళం పాదయాత్రకు తొలి అడుగు వేయనుంది. కుప్పంలో భారీ బహిరంగ సభతో లోకేష్ జనం మధ్య ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళం విప్పనున్నారు. ఇక లోకేష్‌ పాదయాత్ర, బహిరంగ సభకు పర్మిషన్‌పై గత 10 రోజులుగా పెద్దరచ్చనే జరగింది

Lokesh Padayatra: నారాలోకేష్ పాదయాత్రకు అంతా రెడీ .. తొలిరోజు బాలకృష్ణ హాజరు.. 400 రోజులు, 4వేల కి.మీ.సాగనున్న యాత్ర
Lokesh Payadayatra
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2023 | 7:31 AM

నారాలోకేష్ యువగళం పాదయాత్రకు అంతా రెడీ అయ్యింది. షరతులు, పోలీస్‌పర్మిషన్‌తో యాత్ర ప్రారంభం కానుంది. కుప్పంలో యువగళం బహిరంగసభను సక్సెస్‌ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు కసిగా ఉన్నారు. అటు కుప్పం పసుపు మయంగా మారింది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో సందడి కనిపిస్తోంది. 400 రోజులు, 4వేల కిలో మీటర్లు. ఇది ఏపీలో టిడిపి చేపడుతున్న యువ గళం పాదయాత్ర. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా వరకు చేయనున్న పాదయాత్ర. టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో యువగళం పాదయాత్రకు తొలి అడుగు వేయనుంది. కుప్పంలో భారీ బహిరంగ సభతో లోకేష్ జనం మధ్య ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళం విప్పనున్నారు. ఇక లోకేష్‌ పాదయాత్ర, బహిరంగ సభకు పర్మిషన్‌పై గత 10 రోజులుగా పెద్దరచ్చనే జరగింది. 2 ప్రొసీడింగ్స్‌లో మొత్తం 29 నిబంధనలు పొందుపరిచిన చిత్తూరుజిల్లా పోలీస్‌యంత్రాంగం లోకేష్ యువగళంకు అనుమతి నిచ్చింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో వారంరోజులు పాటు సాగే లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ జారీ చేసింది.

కుప్పం నుంచి పాదయాత్రకు సిద్దమైన లోకేష్ ముందుగా తల్లిదండ్రుల ఆశీస్సులు ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్‌లో తాత దీవెనలు, అటు నుంచి కడపలో దర్గా, చర్చికి వెళ్లి తిరుమల చేరి శ్రీవారి ఆశీస్సులు పొందారు. యువగళంకు వేదికైన కుప్పంకు చేరుకున్న లోకేష్ ఇవాళ ఉదయం 11 గంటలకు కుప్పంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆ తర్వాత ఎన్టీఆర్‌కు నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభిస్తారు. యువగళం వినిపించనున్నారు. బహిరంగ సభకు, పాదయాత్రకు పోలీసు పర్మిషన్ పలు నిబంధనలతో ఇచ్చినా భారీ జనసమీకరణ టీడీపీ ప్లాన్ చేస్తోంది. కుప్పం మండలం కమతమూరు వద్ద బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసు యంత్రాంగం ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఇందులో పెద్దగా కఠిన తరమైన నిబంధనలు ఏమీ లేవని మామూలుగా అందరికీ ఇచ్చే అనుమతుల్ని లోకేష్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చామని జిల్లా పోలీస్ శాఖ చెబుతోంది. మరోవైపు తొలిరోజు పాదయాత్రకు లోకేష్‌ మామ, టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నట్లు సమాచారం.

లోకేష్‌ యువగళంపై వైసీపీ నేతలు సెటైర్‌ వేశారు. లోకేష్‌ వార్డు మెంబర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని కామెంట్‌ చేశారు మంత్రి రోజా. మొత్తానికి లోకేష్ యువగళం ప్రారంభానికి ముందే ఆరోపణలు, పర్మిషన్ల పేరుతో ఇబ్బందులు పొలిటికల్ హీట్‌ పుట్టిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..