Warangal: అక్కాచెల్లెళ్లే.. తోడికోడళ్లు.. సర్పంచ్‌, ఎంపీటీసీలు పదవులు.. ముదిరిన ఆధిపత్య పోరు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు

తోటికోడళ్లు, అక్కాచెల్లెళ్లు.. అంతకుమించి గ్రామవారధులు. వీళ్లిద్దరి మధ్య విభేదాలు రోజురోజుకి ముదిరిపోతున్నాయి. నెల్లుట్ల ఆదర్శ గ్రామమని అధికారులు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇద్దరి మధ్య గొడవలతో అభివృద్ధి ఎక్కడ కుంటుపడుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Warangal: అక్కాచెల్లెళ్లే.. తోడికోడళ్లు.. సర్పంచ్‌, ఎంపీటీసీలు పదవులు.. ముదిరిన ఆధిపత్య పోరు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు
Sarpanch And Mptc
Follow us

|

Updated on: Jan 27, 2023 | 7:18 AM

జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో తోటి కోడళ్ల పంచాయతీ పీక్స్‌కి చేరింది. పదవులు, ప్రోటోకాల్‌ అంటూ గొడవ పడుతున్న సర్పంచ్‌, ఎంపీటీసీ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సెన్షేషన్‌గా మారింది. గ్రామ సర్పంచ్‌గా చిట్ల స్వరూప, చిట్ల జయశ్రీ పోటీపడగా స్వరూప గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జయశ్రీ గెలుపొందారు. కాస్త లేటయినా ఇద్దర్నీ పదవులు అలకరించాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ముదిరిపోయింది. దీంతో గ్రామంలో ఏ అభివృద్ది కార్యక్రమం చేపట్టినా ఇద్దరి మధ్య వాగ్వాదం సాధారణమైపోయింది. తాజాగా గ్రామ సర్వసభ్య సమావేశంలోనూ అదే సీన్ కంటిన్యూ అయింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి మ్యాటర్ దాడుల దాకా వెళ్లింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న సర్పంచ్‌, ఎంపీటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదూ.. జిల్లా కలెక్టర్‌, అడిషనల్ కలెక్టర్‌కు కూడా రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చారు.

తనకు ఉన్న పరిచయాలతో గ్రామానికి నిధులు తెస్తుంటే తనపైనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీటీసీ జయశ్రీ ఆరోపిస్తున్నారు. కొంతమంది నేతల అండ చూసుకుని తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని సర్పంచ్ స్వరూప మండిపడుతున్నారు. తమపైనే దాడి చేసి మళ్లీ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటికోడళ్లు, అక్కాచెల్లెళ్లు.. అంతకుమించి గ్రామవారధులు. వీళ్లిద్దరి మధ్య విభేదాలు రోజురోజుకి ముదిరిపోతున్నాయి. నెల్లుట్ల ఆదర్శ గ్రామమని అధికారులు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇద్దరి మధ్య గొడవలతో అభివృద్ధి ఎక్కడ కుంటుపడుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆధిపత్య పోరు పక్కన పెట్టి అభివృద్ధిలో పోటీపడాలంటున్నారు. మరోవైపు ఇద్దరి మధ్య గొడవలకు లోకల్ ఎమ్మెల్యే రాజయ్య.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల అండదండలు కూడా కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు