AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb Alert: రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. వరుసగా రెండోసారి.. వివరాలివే..

శనివారం తెల్లవారుజామున రష్యా నుంచి గోవాకు చెరుకోవలసిన విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించారు అధికారులు. విమానంలో సిబ్బందితో పాటు 240 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారుల ప్రకారం..

Bomb Alert: రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. వరుసగా రెండోసారి.. వివరాలివే..
Azur Air Flight
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 21, 2023 | 12:21 PM

Share

శనివారం తెల్లవారుజామున రష్యా నుంచి గోవాకు చెరుకోవలసిన విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించారు అధికారులు. విమానంలో సిబ్బందితో పాటు 240 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారుల ప్రకారం ఈ విమానం తెల్లవారుజామున 4.15 గంటలకు దక్షిణ గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అజూర్ ఎయిర్ నడుపుతున్న ఈ విమానం(AZV2463) భారత గగనతలంలోకి ప్రవేశించకముందే దారి మళ్లించారని అధికారులు తెలిపారు. ‘రష్యా రాజధాని మాస్కోలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్లే అజూర్ ఎయిర్ చార్టర్డ్ ఫ్లైట్‌కు భద్రతాపరమైన ముప్పు ఉన్నట్లు తెలిసింది.

విమానంలో బాంబు అమర్చినట్లు దబోలిమ్ విమానాశ్రయ డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12.30 గంటలకు ఇమెయిల్ రావడంతో విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించారు. విమానంలో 7 మంది సిబ్బందితో సహా మొత్తం 240 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు శిశువులు కూడా ఉన్నార’ని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే చివరి 11 పదకొండు రోజుల్లో మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపులు రావడం ఇది రెండోసారి. జనవరి 9న అంతర్జాతీయ విమానంలో బాంబు బెదిరింపు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి ఇమెయిల్ రావడంతో.. 244 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి గోవాకు వస్తున్న చార్టర్ ఫ్లైట్‌కు జామ్‌నగర్‌(గుజరాత్)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబడింది.

జనవరి 11న వచ్చిన బాంబ్ అలెర్ట్ గురించి ఇండియాలోని రష్యన్ ఎంబస్సీ చేసిన ట్వీట్..

విమానం ల్యాండింగ్ అయిన తర్వాత, సిఐఎస్ఎఫ్ బృందం, కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు బాంబ్ స్క్వాడ్, ఫైర్ బ్రిగేడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం నుంచి ప్రయాణికులను దింపి విమానాన్ని తనిఖీ చేశారు. చివరికి అది ఒక ఫేక్ అలెర్ట్ అని నిర్ధారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి..