మాటలకందని విషాదం.. తల్లిదండ్రుల పెళ్లి రోజు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. గంటల్లోనే ఊహించని దారుణం..
తనకు జన్మనిచ్చిన అమ్మా, నాన్న అంటే ఆ యువకుడికి ప్రాణం. అందుకే దూరంగా ఉంటున్న తాను.. వారికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించాడు. అందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు.
తనకు జన్మనిచ్చిన అమ్మా, నాన్న అంటే ఆ యువకుడికి ప్రాణం. అందుకే దూరంగా ఉంటున్న తాను.. వారికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించాడు. అందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. ఆ రోజు రానే వచ్చింది. అమ్మానాన్నల వివాహ వార్షికోత్సవం రోజున.. సడెన్‌గా ఇంటికి వచ్చి వారికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంకేముంది.. ఆ పేరెంట్స్ ఆనందంలో తడిసిముద్దయ్యారు. పెళ్లి రోజున తమ కొడుకు తమతో ఉండటంతో సంతోషంతో మురిసిపోయారు. కానీ, ఆ సంతోషం ఎన్ని గంటలు కూడా నిలువలేదు. మొదట ఆనందాన్ని సర్‌ప్రైజ్ ఇచ్చిన తనయుడు.. కొన్ని గంటల తరువాత విషాదాన్ని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని వస్తూ తిరిగిరాని లోకానికి చేరాడు. ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చాడు. ఈ విషాద ఘటన.. ఆగ్రాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగ్రాకు చెందిన అభిషేక్ గుప్తా, ఆర్తీ గుప్తా దంపతులకు హృదిమ్ గుప్తా కుమారుడు ఉన్నాడు. అభితి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్స్ అయిన వీరు అనుపమ్ హైట్స్, మొఘల్ రోడ్డ్, కమ్లా నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, వీరి కొడుకు హృదీమ్ ఢిల్లీలో చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే. జనవరి 20న అభిషేక్, ఆర్తిల వివాహ వార్షికోత్సవం ఉంది. హృదీమ్ తన పేరెంట్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సడెన్‌గా ఇంటికి వచ్చాడు. కొడుకుని చూసి వారు తెగ సంబరపడిపోయారు. అయితే, వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. తల్లిదండ్రుల మ్యారేజ్ డే ని సెలబ్రేట్ చేసిన అనంతరం.. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లాడు హృదీమ్. బర్త్‌డే పార్టీ అయిపోయాక.. అర్థరాత్రి తిరిగి వస్తుండగా.. ఆగ్రాలోని సికంద్రా హైవేపై గురు కా తాల్ సమీపంలో హృదీమ్ ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హృదీమ్ స్పాట్‌లోనే చనిపోగా.. కారులో ఉన్న మరో స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధితులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, హృదీమ్ అప్పటికే చనిపోగా.. గాయపడిన మనీష్ అగర్వాల్ చికిత్స పొందుతున్నాడు.
అయితే, హృదీమ్ మృతిపై పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. వారు బోరున విలపించారు. అప్పటి వరకు ఇంట్లో సంతోషంగా గడిపిన కొడుకు.. కన్నుమూశాడని తెలిసి గుండెలవిసేలా విలపించారు. వివాహ వార్షికోత్సవానికి డుబుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి వచ్చి.. తట్టుకోలేని బాధని ఇచ్చావంటూ మిన్నంటేలా ఆ తల్లిదండ్రులు రోధిస్తున్నారు.
ఇక ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని, ఆ వాహనాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..