K. S. Bhagawan: శ్రీరాముడిపై మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రచయిత కేఎస్‌ భగవాన్‌

శ్రీరాముడిపై ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్ భగవాన్‌ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిండు గర్బిణీగా ఉన్న సీతమ్మను అడవుల పాలు చేశారని, రాముడు భార్య సీతమ్మ తో కూర్చొని నిత్యం..

K. S. Bhagawan: శ్రీరాముడిపై మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రచయిత కేఎస్‌ భగవాన్‌
Ks Bhagwan Comments
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2023 | 11:35 AM

శ్రీరాముడిపై ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్ భగవాన్‌ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిండు గర్బిణీగా ఉన్న సీతమ్మను అడవుల పాలు చేశారని, రాముడు భార్య సీతమ్మ తో కూర్చొని నిత్యం మత్తు పానీయం చేవించే వారని, సీతమ్మకు కూడా మత్తు పానీయాలు తాగేలా చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వాల్మీకి రామాయణమే చెబుతోందని కేఎస్‌ భగవాన్‌ చెప్పుకొచ్చారు. జనవరి 20వ తేదీన కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భగవాన్‌ 2019లోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సీతను నిర్ధాక్షిణ్యంగా రాముడు అడవులకు పంపాడని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమిటనే విషయాన్ని కూడా పట్టించుకోలేదన్నారు. పురోహితులను అడిగితే రాముడి గురించి రోజుకో కథ చెబుతుంటారని, నిజానికి రాముడు రాత్రుల్లో సీతతో కలిసి మత్తుపానీయం తీసుకునేవాడని, ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, వాల్మీకి రామాయణంలో ఉందని అన్నారు.

అయితే అప్పట్లో ఈ వివాదస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేఎస్‌ భగవాన్‌ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఈ సంఘాలు కువెంపునగర్‌లోని రచయిత ఇంటి ముందు హిందూ సంఘాల నాయకులు పూజలు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భగవాన్‌ ఇంటి లోపల ప్రభుత్వ భద్రతను కట్టదిట్టం చేశారు. హిందూ దేవుళ్లపై భగవాన్‌ వ్యాఖ్యలు చేయడం సమాజ శాంతకి భగం కలిగించాయని హిందూ సంఘాలు మండిపడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి