PM Narendra Modi: ప్రధాని మోదీపై ‘బంగార’మంత ప్రేమ.. వినూత్నంగా చాటుకున్న వ్యాపారి..
ప్రధాని మోదీపై బంగారమంత ప్రేమ చాటుకున్నాడో వ్యాపారి. ఏకంగా స్వర్ణ విగ్రహాన్ని క్రియేట్ చేసి ఔరా అనిపించాడు. ఇంతకి వ్యాపారీ ఎందుకలా చేశాడు? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. రాజకీయాలకు అతీతంగా ఆయన్ని ఎందరో అభిమానిస్తారు. కొందరు తమ అభిమానాన్ని టాటూల రూపంలో వెలిబుచ్చితే.. మరికొందరు తమ తమ స్టైల్లో వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపారి ప్రధాని మోదీపై బంగారమంత ప్రేమ చాటుకున్నాడో వ్యాపారి. ఏకంగా స్వర్ణ విగ్రహాన్ని క్రియేట్ చేసి ఔరా అనిపించాడు. ఇంతకి వ్యాపారీ ఎందుకలా చేశాడు? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాని నరేంద్రమోదీపై గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన గోల్డ్ వ్యాపారి బసంత్ బోహ్రా తన అభిమానాన్ని బంగారంతో చాటుకున్నారు. గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంతో దానికి గుర్తుగా బంగారు విగ్రహాన్ని తన ఫ్యాక్టరీలో తయారు చేయించాడు. దాన్ని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్‌లో పెట్టారు. ప్రధాని మోదీ బంగారు ముఖచిత్రంగా వెలిసిన తయారీ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. అంతేకాదూ.. సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారి ఎట్రాక్ట్ చేస్తోంది.
బంగారు విగ్రహాన్ని 156 గ్రాముల బరువు ఉండే అసలుసిసలైన 18 క్యారెట్ల బంగారంతో తన పర్యవేక్షణలో రూపొందించాడు బోహ్రా. దాదాపు 15 నుంచి 20 మంది కళాకారులు కొన్ని రోజులపాటు శ్రమించి తయారు చేశారు. విగ్రహం తయారీకి 11 లక్షలకుపైగా ఖర్చు అయినట్లు ఆయన తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలలో బిజెపికి 156 స్థానాలు దక్కాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇందుకు కారణమైన వ్యక్తిగా మోదీని భావించి తాను ఈ బస్ట్ సైజ్ బంగారు విగ్రహాన్ని రూపొందించానన్నారు వ్యాపారి. వ్యాపారి వీరాభిమానం మోదీ ఫ్యాన్స్‌నే కాదు బీజేపీ శ్రేణుల్ని ఫిదా చేస్తోంది.
ప్రధాని మోదీపై అభిమానంతోనే ఈ విగ్రహం తయారు చేశానని, దీనికి ఇంకా విలువకట్టలేదన్నారు బోహ్రా. అయితే గత 20 ఏళ్లుగా సూరత్‌లోనే ఉంటూ నగలు వజ్రాల వ్యాపారంలో పేరుగడించిన బోహ్రా, ఇంతకు ముందు స్టాట్చూ ఆఫ్ యూనిటీ బంగారు నమూనాను కూడా తయారు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..