Narendra Modi: పోలీసు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ.. సదస్సులో చర్చించనున్న ప్రధానాంశాలివే..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Jan 21, 2023 | 8:38 AM

శనివారం(జనవరి 21) జరగనున్న ‘ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ (డీజీ), ఇన్‌స్పెక్టర్ జనరల్స్(ఐజీ)’కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.  ప్రభుత్వ అధికారుల ప్రకారం..

Narendra Modi: పోలీసు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ.. సదస్సులో చర్చించనున్న ప్రధానాంశాలివే..
Pm Modi To Attend Dg Ig Police Conference

శనివారం(జనవరి 21) జరగనున్న ‘ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ (డీజీ), ఇన్‌స్పెక్టర్ జనరల్స్(ఐజీ)’కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.  ప్రభుత్వ అధికారుల ప్రకారం.. న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీ, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అధికారులతో సహా దాదాపు 100 మంది ప్రముఖులు వ్యక్తిగతంగా కాన్ఫరెన్స్‌కు హాజరవుతారని, మిగిలినవారు వర్చ్యువల్‌గా పాల్గొంటారు. ఇక ఈ కాన్ఫరెన్స్‌లో జైళ్ల సంస్కరణలు, వామపక్ష తీవ్రవాదం, తీవ్రవాద వ్యతిరేక సవాళ్లు, సైబర్ నేరాలు, పోలీసింగ్‌లో సాంకేతికతతో సహా అనేక అంశాలను చర్చించనున్నారు. 

సదస్సు వివరాలు:

జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలకు చెందిన పోలీసు, ఇంటెలిజెన్స్ నిపుణుల మధ్య నిర్దిష్ట విషయాలపై సమగ్ర చర్చలను అనుసరించి ఈ ‘ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ (డీజీ), ఇన్‌స్పెక్టర్ జనరల్స్(ఐజీ)’ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రదర్శనలు కూడా ఉంటాయి. తద్వారా రాష్ట్రాల ఆలోచనలను ఇతర రాష్ట్రాలకు తెలియజేయవచ్చు. ప్రస్తుత కాలంలో భద్రతను మాత్రమే కాకుండా అభివృద్ధి చెందుతున్న సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడానికి కూడా పోలీసింగ్, భద్రతలో భవిష్యత్తు అంశాలపై చర్చలు ప్రారంభకానున్నాయి.

డీజీపీ కాన్ఫరెన్స్‌పై ప్రధాని ఆసక్తి:

మోదీ ప్రభుత్వం వచ్చిన ఏడాది అంటే 2014 నుంచి దేశవ్యాప్తంగా వార్షిక డీజీపీ సమావేశాల నిర్వహణను ప్రధానమంత్రి ప్రోత్సహించారు. ఈ సదస్సు మొదటిగా 2014 గువాహతిలో జరిగింది. ఆ తర్వాత  2015లో ధోర్డో; 2016లో హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ; 2017లో టేకాన్‌పూర్ BSF అకాడమీ, ; 2018లో కేవడియా; IISER, 2019లో పూణే; 2021లో లక్నోలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగింది. పోలీస్ అధికారులతో శాంతి భద్రతల విషయంలో చర్చించాలనే ఉద్దేశ్యంతో ఈ సదస్సును ప్రతిఏటా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu