Telangana: మరికాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ఘటన! ఊరుఊరంతా ఏకధాటిగా..

మరికాసేపట్లో మంగళవాయిద్యాలు మోగాల్సి ఇంట్లో విషాదం అలముకొంది. పచ్చని పెళ్లి పందిట్లో ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్న వేళ ఊహించని వార్త వినాల్సి వచ్చింది..

Telangana: మరికాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ఘటన! ఊరుఊరంతా ఏకధాటిగా..
Telangana News
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2023 | 3:08 PM

మరికాసేపట్లో మంగళవాయిద్యాలు మోగాల్సి ఇంట్లో విషాదం అలముకొంది. పచ్చని పెళ్లి పందిట్లో ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్న వేళ ఊహించని వార్త వినాల్సి వచ్చింది. యమదూత కబురంపినట్లు అప్పటి వరకు హుషారుగా సందడి చేసిన వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబానికి తీరనిలోటు మిగిల్చి అనంతలోకాలకు వెళ్లిన యువకుడిని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో కాపురముంటున్న రావుల శంకరయ్యచారి, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణాచారి (34). ఎంతో ఆరోగ్యంగా ఉండే సత్యనారాయణాచారికి జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతితో ఇటీవల నిశ్చితార్ధం జరిగింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వేడుకల హుషారుగా పాల్గొన్నాడు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే శుక్రవారం (జనవరి 27) వివాహం జరగాల్సి ఉంది. ఐతే ఇంతలోఒక్కసారిగా సత్యనారాయణాచారి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని ఉట్నూరులోని ఆసుపత్రికి తలరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం సత్యనారాయణాచారి మరణించాడు. పెళ్లి బాజాలు మోగాల్సి ఆ ఇంట్లో వరుడు మృతి చెందడంతో ఊరుఊరంతా విషాదంలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..