Hyderabad: ఐదుగురిని పెళ్లాడి.. డబ్బు నగలతో ఉడాయించిన భర్త.. మా భర్తను వెతికి పెట్టండి సారూ అంటూ ఫిర్యాదు

బంజారాహిల్స్ సనత్ నగర్ పరిసర ప్రాంతాలలో మహిళలకు ఆశ చూపించి ట్రాప్ లో పడేసి ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా ఐదుగురుని వివాహాలు చేసుకుని నగదు తో పాటు విలువైన సామాగ్రి తీసుకొని మాయమైపోయాడు.

Hyderabad: ఐదుగురిని పెళ్లాడి.. డబ్బు నగలతో ఉడాయించిన భర్త.. మా భర్తను వెతికి పెట్టండి సారూ అంటూ ఫిర్యాదు
Hyderabad
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2023 | 11:57 AM

మా భర్తను వెతికి పెట్టండి సారూ.. అంటూ హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు కొందరు మహిళలు. అవును.. ఒకటికాదు, రెండుకాదు.. ఓ ఘటనుడు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని సదరు భార్యల వద్దనుంచి డబ్బు, నగలు తీసుకొని ఉడాయించాడు. మోసపోయామని తెలుసుకున్న భార్యలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

నగరంలోని బంజారాహిల్స్ సనత్ నగర్ పరిసర ప్రాంతాలలో మహిళలకు ఆశ చూపించి ట్రాప్ లో పడేసి ఒకరికి తెలియకుండా మరొకరిని.. అలా ఐదుగురుని వివాహాలు చేసుకుని నగదు తో పాటు విలువైన సామాగ్రి తీసుకొని మాయమైపోయాడు. తనమ భర్త ఎక్కడ ఉన్నాడో ఎతికి పెట్టమంటూ పలు పోలీస్‌స్టేషన్లలో మహిళలు చేసిన ఫిర్యాదులతో ఈ బహుభార్యల భర్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భార్యల గ్యాంగ్…ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ఈ ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు ఒకడేనని తేలింది…ఒకే వ్యక్తి పైన పలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులు రావడంతో ఇతను ఐదు వివాహాలు చేసుకున్నాడని భార్యలకు తెలిసింది. దాంతో ఈ భార్యామణులంతా ఏకమై తమ చీటింగ్‌ మొగుడికోసం ఓ స్వచ్ఛంద సంస్థ…సహకారంతో వెతకడం మొదలు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..