Telangana: వీళ్లను జంతువులతో పోల్చితే అవి కూడా సిగ్గుపడతాయేమో.. 14 ఏళ్ల కవల కూతుళ్లను…

దంపతులకు కవలలు.. కొంతకాలం క్రితం మొదటి భార్య చనిపోయింది.. ఈ క్రమంలో మరో పెళ్లి చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో తండ్రి, సవతి తల్లి కలిసి దారుణాకి ఒడిగట్టారు.

Telangana: వీళ్లను జంతువులతో పోల్చితే అవి కూడా సిగ్గుపడతాయేమో.. 14 ఏళ్ల కవల కూతుళ్లను...
Crime News
Follow us

|

Updated on: Jan 26, 2023 | 11:56 AM

దంపతులకు కవలలు.. కొంతకాలం క్రితం మొదటి భార్య చనిపోయింది.. ఈ క్రమంలో మరో పెళ్లి చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో తండ్రి, సవతి తల్లి కలిసి దారుణాకి ఒడిగట్టారు. ఎలాగైనా ఇద్దరు బాలికలను వదిలించుకోవాలని ప్లాన్ వేసి ఇద్దరు మైనర్ కుమార్తె (14) లను పెళ్లి ముసుగులో అమ్మేశారు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లాలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కవలల తల్లిదండ్రులతో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసి.. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మాచారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి మొదటి భార్య కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు కవల పిల్లలు ఉన్నారు. దీంతో భర్త మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు, బిడ్డ ఉన్నారు. మొదటి భార్య ఆడ పిల్లలు పెరిగి పెద్దవుతున్న తరుణంలో.. నలుగురు పిల్లలను పెంచడం సవతి తల్లికి ఇష్టంలేకపోయింది. ఈ క్రమంలో కవలలను విక్రయించాలని భార్యభర్తలు ప్లాన్ వేశారు.

ఓ మధ్యవర్తిని కలిసి పిల్లలకు పెళ్లి చేయాలని వివరించారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి ఉన్నాడని, అతనితో పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తాడని ఆశపెట్టి రూ.80వేలకు బేరం కుదిర్చాడు. కామారెడ్డిలో స్థిరపడిన రాజస్థాన్​వ్యాపారి శర్మన్‌కు 14ఏళ్లు ఉన్న రెండో అమ్మాయిని విక్రయించారు. 2022 సెప్టెంబర్లో హైదరాబాద్​నగర శివారులో శర్మాన్‌తో బాలికకు పెళ్లి జరిపించారు. శర్మాన్ ఇచ్చిన రూ.80వేలలో 30 వేలు మధ్యవర్తి, మిగతా రూ.50వేలు తల్లిదండ్రులకు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత మరో కూతురును హైదరాబాద్‌కు చెందిన కృష్ణ కుమార్​అనే వ్యక్తికి రూ.50వేలకు అమ్మి, పెళ్లి జరిపించారు. రెండో బాలికను పెళ్లి చేసుకున్న శర్మాన్​మెదక్​జిల్లా మనోహరాబాద్లో కాపురం పెట్టాడు. అప్పటికే అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉంది.

ఇరు జంటలు కూడా హైదరాబాద్ సమీపంలో తమ కుటుంబ జీవితాన్ని ప్రారంభించాయి. అయితే తమ భర్తలకు అప్పటికే వివాహమై పిల్లలు ఉన్నారని కవల సోదరీమణులు తెలుసుకున్నారు. దీంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో కవల సోదరీమణులలో ఒకరు నిందితుల బారి నుంచి బయటపడి జనవరి 16న ఉగ్గర్వాయి గ్రామానికి చేరుకుంది. వివరాలు తెలుసుకున్న గ్రామస్థులు బాలిక గురించి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డిసిపిఓ) స్రవంతికి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆమె సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. తన తల్లిదండ్రుల దురాఘతం, అలాగే భర్త శారీరకంగా, మానసికంగా వేధించిన తీరును చెబుతూ కన్నీరుమున్నీరయ్యింది. తన భర్త రోజూ వేధిస్తున్నాడని.. కొడుతున్నాడని పేర్కొంది. 100 రూపాయలతో కామారెడ్డికి చేరుకున్నట్లు తెలిపింది. అయితే, 20 రోజుల క్రితమే తన సోదరి కూడా ఒకరికి అమ్మినట్లు తెలియడంతో ఆమెను ఆదుకొని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇప్పుడు కవలలు తమ సంరక్షణలో ఉన్నారని.. వారు చదువుకుంటామంటే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని డీసీపీఓ స్రవంతి తెలిపారు.

బాలిక ఇచ్చిన సమాచారం మేరకు డీసీపీఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా కవల సోదరి తండ్రి, సవతి తల్లి, కృష్ణకుమార్, శర్మ, మహేందర్, కాలర్ రాంబటి, ఏజెంట్లుగా పనిచేసిన రమేష్‌తోపాటు ఏడుగురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఏడుగురిని రిమాండ్‌కు తరలించి విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..