AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggery For Diabetes: డయాబెటిస్ బాధితులు బెల్లం తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మధుమేహంతో బాధపడేవారు స్వీట్‌లను నివారించడం తరచుగా సవాలుగా మారుతుంది. డయాబెటిక్ రోగుల కోసం పండుగ సీజన్‌ను

Jaggery For Diabetes: డయాబెటిస్ బాధితులు బెల్లం తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Jaggery
Shaik Madar Saheb
|

Updated on: Jan 25, 2023 | 1:51 PM

Share

మధుమేహంతో బాధపడేవారు స్వీట్‌లను నివారించడం తరచుగా సవాలుగా మారుతుంది. డయాబెటిక్ రోగుల కోసం పండుగ సీజన్‌ను మరింత ఆనందదాయకంగా మార్చడానికి శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా.. బెల్లం ఉపయోగించడం మంచిదని భావిస్తారు. ఇది శుద్ధి చేసిన చక్కెర కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుందని పేర్కొంటుంటారు. అయితే వాస్తవానికి బెల్లం ఆరోగ్యానికి మంచిదే. కానీ.. డయాబెటిస్ లో బెల్లం తినొచ్చా లేదా అన్న విషయాలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లం వాడటం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని డయాబెటిస్ అధ్యాపకులు వివరిస్తున్నారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా బెల్లం మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక కాదంటున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండటం.. నేరుగా చక్కెర, గ్లూకోజ్ కంటే ఎక్కువగా లేనప్పటికీ మధుమేహం ఉన్న వ్యక్తికి ఇది హానికరంగా పరిగణిస్తున్నారు. ఇది తిన్న తర్వాత రక్త ప్రసరణ త్వరగా గ్రహిస్తుందంటున్నారు.

బెల్లం ఎందుకు మంచిది కాదు..

బెల్లం చాలా ఎక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్నందున, డయాబెటిక్ రోగులు వారి ఆహారంలో బెల్లం చేర్చుకోవడం మంచిది కాదు. మధుమేహం ఉన్నవారు సాధారణంగా తీపిని తినకుండా ఉండాలి. చక్కెర ప్రత్యామ్నాయాలతో చేసిన డెజర్ట్‌లను కూడా తినకూడదు. ఎందుకంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తీపి పదార్థాలు సహాయం చేయలేవు.. ఇంకా పెంచేందుకు దోహదపడతాయి.

ఇవి కూడా చదవండి

పంచదార – బెల్లం హానికరమా?

బెల్లం, చక్కెర రెండింటినీ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిపై స్వల్ప ప్రభావం ఉంటుంది. చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యంగా ఉండగలవని చాలా మంది నమ్ముతారు. అయితే, ఇది తప్పు. బెల్లంలో సుక్రోజ్ ఉంటుంది. ఇది సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, మన శరీరం గ్రహించినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంటే బెల్లం కూడా ఇతర చక్కెరల వలె ప్రమాదకరం.

మధుమేహం లేని వారు చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించవచ్చు. ఇది తెలివైన నిర్ణయం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని వైద్యులు సిఫార్సు చేస్తారు. అందుకే బెల్లం తినడానికి వీల్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మీరు ఆరోగ్యంతో ఉంటే బ్లడ్ షుగర్‌ విషయంలో ఎటువంటి సమస్య లేనట్లయితే చక్కెర స్థానంలో బెల్లం ఉపయోగించవచ్చు. అయితే, మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే బెల్లం పూర్తిగా మానేయాలని పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Follow Us
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..
సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..
శ్రేయస్ అయ్యర్‌ భారీ జంప్.. కోహ్లీకి బిగ్ షాక్..!
శ్రేయస్ అయ్యర్‌ భారీ జంప్.. కోహ్లీకి బిగ్ షాక్..!
ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. వేధించిన పోకిరిని..
ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. వేధించిన పోకిరిని..
అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు నవ్విస్తున్నాడు..!
అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు నవ్విస్తున్నాడు..!