Andhra Pradesh: ఈ చిన్న వీడియో అప్‌లోడ్ తలరాత మారుతుంది అనుకుంది.. కట్ చేస్తే తలబొప్పి కట్టింది..

సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. చాలామంది బాధితులుగా మారుతున్నారు. తాజాగా.. బీటెక్ పూర్తిచేసిన ఓ అమ్మాయి.. భారీ మోసపోయింది. యూట్యూబ్‌లో జస్ట్‌ సబ్‌స్క్రైబ్‌ చేస్తే చాలు డబ్బులు వస్తాయంటూ నమ్మించారు.

Andhra Pradesh: ఈ చిన్న వీడియో అప్‌లోడ్ తలరాత మారుతుంది అనుకుంది.. కట్ చేస్తే తలబొప్పి కట్టింది..
Cyber Crime
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 25, 2023 | 1:11 PM

సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. చాలామంది బాధితులుగా మారుతున్నారు. తాజాగా.. బీటెక్ పూర్తిచేసిన ఓ అమ్మాయి.. భారీ మోసపోయింది. యూట్యూబ్‌లో జస్ట్‌ సబ్‌స్క్రైబ్‌ చేస్తే చాలు డబ్బులు వస్తాయంటూ నమ్మించారు. ఆమె ప్రొసిడ్‌ కావడంతో నట్టేట ముంచారు. ఈ షాకింగ్‌ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోరుమామిళ్ల పట్టణానికి చెందిన ఓ యువతి బీటెక్‌ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో సబ్‌స్రైబ్‌ చేస్తే డబ్బులొస్తాయంటూ సైబర్‌ నేరస్థుల మాటలు నమ్మి రూ.14,75,000 పోగొట్టుకుంది. ఆమె గమనించే సమయానికి జరగాల్సినదంతా జరగడంతో చివరకు పోలీస్‌ స్టేషన్ మెట్లెక్కింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ హరిప్రసాద్‌ వెల్లడించారు. వీడియోతీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే డబ్బులొస్తాయని సైబర్‌ నేరగాళ్లు నమ్మించారని.. దీంతో ఆమె ఆసక్తిగా అప్‌లోడ్‌ చేయడంతో మొదటి రోజు రూ.2 వేలు, తర్వాత రూ.3 వేలు చొప్పిన వచ్చినట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మించడంతో.. వారి మాటలు నమ్మి యువతి పెట్టుబడి పెట్టింది. అయితే, వచ్చిన డబ్బులకు పన్నులు కట్టాలని వారు చెప్పడంతో వారం రోజుల్లోనే రూ.14,75,000 మేర సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలకు ఆమె ట్రాన్స్‌ ఫర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ఆమె చేతిలో డబ్బులు లేకున్నా బ్యాంకులో రూ.2 లక్షలు రుణం తీసుకొని వారు చెప్పిన ఖాతాలకు నగదు జమ చేసినట్లు యువతి వాపోయింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీలోపు ఈ ఆర్థిక లావాదేవీలన్నీ జరిగాయని ఫిర్యాదులో వివరించింది. చివరకు మోసపోయానని గమనించి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?