AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kandukur: పామును ఫోటో తీయడమే డేంజర్.. అలాంటిది మెడలో వేసుకుని సెల్ఫీనా.. చేతులారా రాసుకున్న మరణం

సెల్ఫీ మోజు ప్రాణాలు తీస్తుందని తెలిసికూడా తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొందరు. ఎంతో భవిష్యత్తు వున్న యువకులు.. క్షణాల ఆనందం కోసం శాశ్వతంగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.

Kandukur: పామును ఫోటో తీయడమే డేంజర్.. అలాంటిది మెడలో వేసుకుని సెల్ఫీనా.. చేతులారా రాసుకున్న మరణం
Snakebite (Representative image)
Ram Naramaneni
|

Updated on: Jan 25, 2023 | 1:46 PM

Share

సెల్ఫీ చిత్రాల మోజు.. యువత ప్రాణాల మీదకు తెస్తోంది. పొంచి ఉన్న ప్రమాదాలను గమనించకుండా సెల్పీ ట్రాప్‌లో పడి.. కోరి ముప్పు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని సెల్ఫీల గోల ఎక్కువైంది..సెల్ఫీ దిగి ఆ చిత్రాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పెట్టాలని తపన పడుతున్నారు. ఆ అత్యుత్సాహం వారి ప్రాణాలను బలికొంటోంది. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోంది.

ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు ప్రాణాలు వదిలాడు. త్రాచుపాములు, అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు…అడవుల్లో ఉండేవి. లేదంటే జనావాసలు లేని చోట తలదాచుకునేవి. కాని ఈమధ్యకాలంలో నివాస ప్రాంతాల్లోనే ఎక్కువగా సంచరిస్తున్నాయి. కాలనీలు, ఇళ్ల పరిసరాల్లోనే కాదు…ఏకంటా ఇళ్లలోకి చేరి దర్జాగా పడగవిప్పి బుసలు కొడుతున్నాయి. పులితో అయినా ఫోటో దిగొచ్చేమోగానీ… పాము ముందు ఫోజులిస్తే మాత్రం కాటు తప్పదు. అలాంటిది కందుకూరులో మణికంఠ రెడ్డి అనే యువకుడు దాన్ని పట్టుకుని, మెడలో వేసుకుని ఫోటో తీసుకునే ప్రయత్నం చేశాడు. భయంతో అది కాటు వేయడంతో.. పరిస్థితి విషమించి కన్నుమూశాడు. మృతుడు తాళ్ళూరు మండలం నుంచి కందుకూరులో జ్యూస్ షాపు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలకు ఎక్కువ లైకులు సంపాదించుకోవాలనే ఉత్సాహం, పోటాపోటీగా మారింది. దీనికి తోడు తమ పోస్టింగులు వైరల్ కావాలన్న ఫీవర్ పెరగడం మరొకటి. కొత్తదనంతో కూడిన సెల్ఫీల వేటలో యువత ఆ పని ఎంత ప్రమాదకరమైందన్న విషయం గమనించడం లేదు. అంతే తప్ప భద్రతాపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇంటర్నెట్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా కనెక్షన్లు అరచేతిలోకి అందుబాటులో రావడం, షేరింగ్‌లు, లైకింగ్‌ల పేరుతో సెన్షేషన్ కోసం క్రేజీ తీవ్రమై సెల్ఫీ..కిల్ఫీగా మారుతున్నది.. ఈ మాయలోనే బోలెడంత భవిష్యత్ అర్థాంతరంగా ముగిసిపోతుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..