Tirupati: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురి భక్తుల దుర్మరణం
తిరుపతి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్రొడ్డుపల్లి వద్ద కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
తిరుపతి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్రొడ్డుపల్లి వద్ద కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.చనిపోయిన వారంతా మహారాష్ట్రకు చెందిన శ్రీవారి భక్తులుగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత కారులో కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ వ్యాన్ లో 9 మంది భక్తులున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.