Nara Lokesh-Tirupati: శ్రీవారి సేవలో నారా లోకేష్.. క్యూ లైన్‌లో గంట వెయిట్ చేయించారంటూ టీడీపీ నేత ఆరోపణ..

వారి ఆలయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ఉదయం 6.45 గంటలకు దర్శన రిపోర్టింగ్ టైమ్ ఇచ్చి గంట సేపు ఆలస్యం చేయించారని వాపోయారు.

Nara Lokesh-Tirupati: శ్రీవారి సేవలో నారా లోకేష్.. క్యూ లైన్‌లో గంట వెయిట్ చేయించారంటూ టీడీపీ నేత ఆరోపణ..
Nara Lokesh
Follow us

|

Updated on: Jan 26, 2023 | 12:14 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన నారా లోకేష్ ను టీటీడీ అధికారులు అదనంగా గంట పాటూ క్యూలైన్లలో వెయిట్ చేయించారని ఆరోపించారు టీడీపీ నేత బీ.టెక్ రవి. ఈరోజు ఉదయం ఆయన నారా లోకేష్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రకు విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. శ్రీవారి ఆలయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ఉదయం 6.45 గంటలకు దర్శన రిపోర్టింగ్ టైమ్ ఇచ్చి గంట సేపు ఆలస్యం చేయించారని వాపోయారు. కంపార్టమెంట్ లో 40 నిమిషాలు, క్యూలైన్లో మరో 20 నిమిషాలు నారా లోకేష్ ను వెయిట్ చేయించారన్నారు. దైవ దర్శనంలో కూడా ఇలాంటి అడ్డంకులు పెట్టడం దారుణమన్నారు.

పాదయాత్ర పై రోజా చేసిన వ్యాఖ్యలపై బి.టెక్ రవి ఘాటుగా స్పందించారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి, జనాలు రాకపోతే సర్వమంగళం అనాలి కానీ, పాదయాత్ర మొదలు కాకుండానే సర్వమంగళం అని ఎలా అంటారని మండిపడ్డారు. నాలుగు ఐదు రోజుల్లో మంత్రి రోజాకు లోకేష్ పాదయాత్ర గూర్చి తెలుస్తుందనీ, సీఎం జగన్ మీడియా సమావేశాల్లో విలేఖరుల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. సీఎం జగన్ సభల్లో పేపర్ చూడందే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారనీ, సభల్లో లోకేష్ మాట్లాడుతున్న తీరును చూడాలన్నారు. వైసీపీకి భయం పట్టుకొని లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలనుకుంటున్నారని ఆరోపించారు.

ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు శేష వస్త్రం కప్పి తీర్థప్రసాదాలను అందజేశారు. యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించారు నారా లోకేష్. దర్శనానంతరం జీఎంఆర్ అతిధిగృహానికి చేరుకున్నారు నారా లోకేష్.

ఇవి కూడా చదవండి

Reporter: Anil

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??