Andhra Pradesh News: ఆత్మకూరు యువకుడికి రూ.1.2 కోట్ల భారీ వేతనంతో ‘ఇంటెల్‌’లో జాబ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు యూఎస్‌కు చెందిన ఇంటెల్‌ కంపెనీలో రూ.1.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. తాజాగా నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో..

Andhra Pradesh News: ఆత్మకూరు యువకుడికి రూ.1.2 కోట్ల భారీ వేతనంతో 'ఇంటెల్‌'లో జాబ్‌
Nellore News
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2023 | 4:17 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు యూఎస్‌కు చెందిన ఇంటెల్‌ కంపెనీలో రూ.1.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. తాజాగా నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధి ఈ మేరకు భారీ ప్యాకేజీతో ఉద్యోగం పొందడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళ్తే..

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగల్‌పల్లికి చెందిన ఈగ మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి. తాజాగా ఖరగ్‌పూర్‌ ఐఐటీలో నిర్వహించిన క్యాంపస్‌ సెలక్షన్‌లో సాయికృష్ణారెడ్డి ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే ఏడాది మేలో కోర్సు పూర్తి చేయనున్నాడు. అనంతరం ఆదే ఏడాది ఆగస్టులో అమెరికాకు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నాడు. ఈ సందర్భంగా సాయికృష్ట తల్లిదండ్రులు మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం చేసి సంపాదించినదంతా పిల్లల భవిష్యత్తు కోసం వెచ్చిస్తున్నామని, పిల్లలు ఉన్నత స్థానంలో ఉండటం కన్నా తమకు వేరే కోరిక లేదని భావోద్వేగానికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.