Nandamuri Balakrishna: వారికి దబిడి దిబిడే… బాలయ్య మాస్ వార్నింగ్

ఆన్ గోయింగ్ బర్నింగ్ ఇష్యూపై కనీసం మాట్లాడని బాలయ్య.. ప్రభుత్వంపై మాత్రం పంచ్‌లు పేల్చారు. తన మార్క్ డైలాగ్స్‌తో రచ్చ చేశారు.

Nandamuri Balakrishna: వారికి దబిడి దిబిడే... బాలయ్య మాస్ వార్నింగ్
Nandamuri Balakrishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 26, 2023 | 1:02 PM

“యథాలాపంగా, ప్లోలో వచ్చిన ఓ మాటను లాగి, గెలికి రచ్చ చేస్తున్నారు. దాని గురించి అస్సలు పట్టించుకోను. అసలు ఆ ఆలోచన కూడా దరిచేరనివ్వను”.. బాలయ్య వెర్షన్ ఇంచుమించు ఇదే అనిపిస్తుంది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ బాలయ్య కామెంట్స్‌పై కాకరేగుతున్న విషయం తెలిసిందే. ఓ నిర్మాతతో తమ సంభాషణ నాన్నగారి గురించి, రంగారావు గురించి, ఆ అక్కినేని.. ఈ…….. అంటూ బాలయ్య కామెంట్స్ పేల్చారు. బాలయ్య స్పీచ్ వింటే.. అవి ఏవో ప్లోలో వచ్చినవి లాగానే ఉంది. ఆయనకు కించపరచాలన్న ఉద్దేశం కూడా లేదనే అర్థమవుతుంది. కానీ ఓ మహానటుడి కొడుకు అయి ఉండి.. శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తూ.. 100 సినిమాలు చేసిన హీరో.. మాట్లాడేముందు కాస్తా వెనుకా, ముందు చూసుకోవాలి కదా అన్నది చాలామంది వెర్షన్. దీనిపై రచ్చ జరుగుతుంది. అగ్గి పెట్టేవాళ్లు పెడుతున్నారు.. సెగ కాచుకునేవాళ్లు కాచుకుంటున్నారు. నిజంగా హర్టయినవాళ్లు కూడా ఉన్నారు. ఇంత జరుగుతున్నా.. బాలయ్య కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

అందుకు బదులుగా తన నియోజకవర్గం హిందూపురం వెళ్లి తన కార్యక్రమాలు తాను నిర్వహించుకుంటున్నారు. ప్రజలను కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. అవును.. తాజాగా హిందూపురం సరస్వతీ విద్యా మందిర్ లో కంప్యూటర్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ రావట్లేదని.. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని… ఉన్న పరిశ్రమలు వెళ్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వంపై తిరగబడాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని.. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమలు తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు.

ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. ఎవరైనా నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తన సినిమాల్లో వినోదం, విజ్ఞానంతోపాటే సందేశం కూడా ఉంటాయన్నారు. సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదు… కానీ అభివృద్ధి చేయాలంటే మాత్రం అధికారం ఉండాలన్నారు. చదువుకున్న తర్వాతే తనను సినిమాల్లోకి రావాలని ఎన్టీఆర్ సూచించినట్లు తెలిపారు. ఒకవేళ సినిమాల్లో  రాణించలేకపోతే… చదువుకున్నా కాబట్టి ఉద్యోగమైనా చేసుకోగలను అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..