Pawan Kalyan: వాళ్లకి ఇంకా మదం ఎక్కనీ.. అప్పుడు దండయాత్ర చేద్దాం.. జనసైనికులకు జనసేనాని పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయాలపై రిపబ్లిక్ డే ప్రసంగంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు . ముఖ్యంగా కోడికత్తి రాజకీయాలతో సీఎం కానని.. జనం కోరుకుంటేనే అవుతానని జనసేనాని వెల్లడించారు.

Pawan Kalyan: వాళ్లకి ఇంకా మదం ఎక్కనీ.. అప్పుడు దండయాత్ర చేద్దాం.. జనసైనికులకు జనసేనాని పిలుపు
Pawan Kalyan
Follow us

|

Updated on: Jan 26, 2023 | 1:06 PM

ఏపీని మరోసారి విడగొడతానంటే తోలుతీసి విరగ్గొడతాం మీకు మరో రాష్ట్రం కావాలా.. రాష్ట్రాన్ని విడగొడతానంటే వేర్పాటు ధోరణితో ఉంటే నా అంతటి తీవ్రవాదని ఇంకొకరిని చూడరని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జనసేనాని పాల్గొన్నారు. వేడుకల్లో జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు ఇంక ఆపండి.. మీరు రాష్ట్రాన్ని విడగొడతానంటే చూస్తూ ఊరుకుంటామా.. పిచ్చి నాయకులు, ఈ ముసలోళ్లు మాట్లాడే మాటల్ని నమ్మకండని అన్నారు.

అవకాశవాదంతో రాష్ట్రాన్ని విడగొట్టే వాళ్ల మాటలు నమ్మకండి దేశ సమగ్రతకు భంగంకలిగించి.. మతాల మధ్య చిచ్చుపెడితే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. తన వారాహి వాహనంపై జరుగుతున్న రచ్చతో పాటు వైసీపీ ప్రభుత్వ పాలనపై పవన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. రోడ్డు మీదకు వస్తానంటే మిమ్మల్ని ఆపేస్తాం, తోసేస్తాం, కింద పడేస్తాం.. జీవో నంబర్ 1 వ్యవహారాన్ని కూడా ప్రస్తావిస్తూ పవన్ సెటైర్లు సంధించారు.

అలాగే మీ వారాహి మా ఏపీ రోడ్లపై ఎలా తిరుగుతుందో మేమూ చూస్తామని కూడా అంటున్నారని పవన్ ప్రస్తావించారు. తానెలా ఆలోచిస్తానంటే వింటానని, మాట్లాడనని, ఈ రంగు కాదు, ఆ రంగు కాదని ఒక్కొక్కరూ పేట్రేగిపోయారంటూ వైసీపీ మంత్రులు, నేతల్ని ఉద్దేశించి విమర్శించారు.

అయితే, తాను మర్డర్లు, కోడి కత్తులతో పొడిపించుకోవడం వంటి పనులు చేయనని జనసేనాని ఎద్దేవ చేశారు. తాను చట్టాల్ని పాటించేవాడిని, వాటిని అతిక్రమించి వారాహిని ఎందుకు బయటికి తెస్తామని పవన్ కల్యాణ్ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు. తప్పుడు పనులు చేసి వేల కోట్లు దొబ్బేసి, వేల ఎకరాలు దోచేసుకుని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని కూడా దుర్వినియోగం చేసిన మీకే ఇంత ధైర్యం ఉంటే.. ఏ తప్పూ చేయని మాకెంత ఉండాలంటూ ప్రశల వర్షం కురిపించారు. మీరు మాతో గొడవ పెట్టుకోండి.. అప్పుడు మేం ఏంటో చెప్తామంటూ సవాల్ విసిరారు.వారాహికి కాస్త మదమెక్కనీయండి.. అప్పుడు దండయాత్ర చేద్దామంటూ కార్యకర్తలను  సముదాయించే ప్రయత్నం చేశారు జనసేనాని.

బాబాయిని చంపి సీబీఐకి కేసు అప్పగించుకోవడం.. కోడి కత్తితో పొడిపించుకుని తెలంగాణ వైద్యులు దగ్గరకు వెళ్లడం.. ఏపీ పోలీసులుపై నమ్మకం, గౌరవం లేదన్న వ్యక్తి.. ఇప్పుడు సీఎంగా పోలీసులు అందరూ శాల్యూట్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఒక పోలీసునే జైలులొ పెట్టి కొట్టిన వ్యక్తి అతను.. వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరికీ సమాధానం చెప్పనక్కరలేదని అనుకుంటున్నారని విమర్శించారు.

వాళ్ల మెడలు వంచి సమాధానం చెప్పిస్తాం.. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ మాటల తూటాలకు పదను పెట్టారు. జనసేన పక్షాన నిలబడిన వ్యక్తి ని రోడ్డు ప్రమాదంలో చంపేశారని.. రేపు ఎలాంటి‌ ప్రభుత్వం వచ్చినా దివ్యాంగులకు పెన్షన్, అభివృద్ధికి తోడ్పాటు అందించే పధకాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

ఐదు వేల జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెబుతారా అంటూ ప్రశ్నించారు. వాళ్ల నాన్న సీఎం.. అందుకే కోట్లు దోచుకున్నాడు.. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కోసం సంతకాలు చేయించాడు అంటూ సీఎం జగన్‌పై సూటిగా మాటల దాడి చేశారు జనసేనాని. ఇటువంటి వ్యక్తి ని నమ్మి ఓటు వేస్తే వారినీ మోసం చేశాడు.. నాతో సహా ఎవరికీ వ్యక్తి గత ఆరాధన గుడ్డిగా చేయకండని హితవు పలికారు.

తెలంగాణ తరహా తిరుగుబాటు ఉద్యమం ఉంటే.. ఏపీ ప్రజలు ఎప్పుడో బాగు పడేవారన్నారు. ఏపీ ప్రజలకు కులాల మీద ఉ‌న్న పిచ్చ.. అభివృద్ధి మీద లేదంటూ విమర్శించారు. జనసేన మాత్రం ప్రజల పక్షానే నిలుస్తుందన్నారు.

పాలించాలన్నా.. మేమే అన్న ఒక వ్యక్తి కామెంట్ కులానికి అంటగడుతుంది. సకలశాఖ మంత్రి చెప్పారని అనుకోవాలా.. అలా మాట్లాడవచ్చా అంటూ ప్రశ్నించారు. నేనైతే ఆ వ్యక్తితో క్షమాపణ చెప్పిస్తా అంటూ వ్యాఖ్యానించారు. ఒక కులం ఎక్కువ కాదు మరో కులం తక్కువ అంటే అది మంచి విధానం కాదన్నారు. కులాలను విడదీయటానికి మీ నాయకుడిలా నేను చేయనంటూ వైసీపీ నేతలకు సూచించారు.

ప్రధానిని కలిస్తే ఈసారి సజ్జల,వైసీపీ నాయకుల మీద ఫిర్యాదు చేస్తానన్నారు. మీకు వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇస్తారు.. ఏపీలో ఆలయాలు కూలదోస్తారని‌ చెబుతాని అన్నారు. భవిష్యత్తు బాగుంటుంది.. మీరు జనసేనకు అవకాశం ఇవ్వండి.. నేను మాట ఇస్తున్నానంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరారు.

ధర్మాన, బైరెడ్డి ప్రత్యేక రాష్ట్రాలు అంటే సరిపోతుందా..? ఏమయ్యా ధర్మాన నీకు మంత్రి ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రం కావాలి.. మీరు వేర్పాటు వాదంతో మాట్లాడితే నా లాంటి తీవ్రవాది ఉండరు. అసలు మీకెం తెలుసు… మీ ఇష్టం వచ్చినట్లు విడగొడితే తోలు తీసి కూర్చోబెడతాం.. మీ సన్నాసుల వల్ల విసిగిపోయాం.. ఇది మా నేల కాదా..? మా దేశం కాదా..? రాయలసీమ అనే వాళ్లు ఎందుకు అక్కడ అభివృద్ధి చేయలేదు..? రాష్ట్రాన్ని, ప్రజలను‌ విడగొట్టింది ఇక చాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ‌ప్రైవేటీకరణ గురించి రాజకీయం చేస్తారా..? ఎంతోమంది ప్రాణ త్యాగం‌వల్ల ప్లాంట్ వచ్చిందన్నారు.

ఇదంతా నా కోపం కాదు… నా ఆవేదన అంటూ వివరించారు. పాత తరం నాయకులకు శక్తి సామర్థ్యం క్షీణిస్తుంటే.. కొత్త తరం అందుకోవాలి .. అవకావ వాద రాజకీయం‌ చేసే ముసలి నాయకులను నమ్మవద్దు. దేశ సమగ్రతకు భంగం కలిస్తే.. నేను బలంగా స్పందిస్తా..  నా కుటుంబం కన్నా నాకు ప్రజల క్షేమమే ముఖ్యం. సర్వేజన సుఖినోభవంతు… అందరం‌ కలిసి రాష్ట్రం కోసం పని చేద్దామంటూ పిలుపునిచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం