Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanha Music Fest: కళామతల్లి ముద్దుబిడ్డ అమ్జద్ అలీ ఖాన్.. సరోద్ విద్వాంసుడి సంగీత ప్రస్థానం సాగిందిలా..

కన్హా శాంతి వనంలో  మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ చెందిన సంగీత విద్వాంసులు తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఈ రోజు సంగీత ప్రియులను తన సంగీతంతో అలరించనున్నారు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. 

Kanha Music Fest: కళామతల్లి ముద్దుబిడ్డ అమ్జద్ అలీ ఖాన్.. సరోద్ విద్వాంసుడి సంగీత ప్రస్థానం సాగిందిలా..
Amjad Ali Khan
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2023 | 7:20 AM

శ్రీరామ చంద్ర మిషన్ ఆది గురువు లాలాజీ మహారాజ్ 150వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జయంతి వేడుకల్లో మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు వారం రోజుల పాటు  కన్హా శాంతి వనంలో  మ్యూజిక్ ఫెస్టివల్ జరగనుంది. సంగీతం ద్వారా దైవాన్ని ఆరాధించాలానే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలను  తెలంగాణ ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలు తమ సహకారంతో నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే శాస్త్రీయ సంగీత ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పాల్గొనే అవకాశం ఉంది. ఈ  మ్యూజిక్ ఫెస్టివల్ లో అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ చెందిన సంగీత విద్వాంసులు తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఈ రోజు సంగీత ప్రియులను తన సంగీతంతో అలరించనున్నారు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్.

ప్రసిద్ధ సంగీత విద్వాంసులు ఉస్తాద్ అలీ ఖాన్ సరోద్ .. ప్రముఖ సరోద్ వాద్యకారుడు. పద్మశ్రీ ,  పద్మ భూషణ్ గ్రహీత. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరు. అమ్జద్ అలీ ఖాన్ మధ్య ప్రదేశ్ లోని గాలియర్ లో అక్టోబర్ 9వ తేదీ   1945వ సంవత్సరంలో జన్మించారు. అలీ ఖాన్ కుటుంబం సరోద్ వాద్యకారులకు ప్రసిద్ధిగాంచింది. అలీ ఖాన్ చిన్న వయసు నుంచి తండ్రి హాఫీజ్ అలీఖాన్ మార్గనిర్దేశంలో సరోద్‌ను అభ్యసించారు. అతని కుటుంబంలో ఆరో తరం వాయిద్య కారుడిగా నిలిచారు.

ఆరు సంవత్సరాల వయస్సులో తన మొదటి ప్రదర్శనను ఇచ్చిన అమ్జద్ అలీ ఖాన్ 1958వ సంవత్సరంలో తన 12వ ఏట తన మొట్ట మొదటి సారిగా సోలోగా సరోద్ సంగీత ప్రదర్శన ఇచ్చారు. అయితే సరోద్ ప్రదర్శనలో తనదైన ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు.  సరోద్ ను ఉపయోగించి విభిన్న స్వరాలను సృష్టిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించారు. సరోద్‌ను ఉపయోగించి అత్యంత సంక్లిష్టమైన పదబంధాన్ని సొగసైన , సరళమైన కూర్పులతో కంపోజిషన్‌ చేస్తూ.. తన  కచేరీలతో ప్రపంచ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఉస్తాద్ అమ్జద్ ఖాన్ మినిమలిస్ట్ సంగీత విద్వాంసులు. సరోద్ సంగీత వాయిద్యం కేవలం రెండు తీగలు – చికారి, జోడ్ మరియు 11 తారాబ్ తీగలు మాత్రమే ఉంటాయి. ఈ వాయిద్యాన్ని సరళీకృతం చేసారు. ప్రస్తుతం ప్రతిధ్వనించే (తుంబా) పొట్లకాయను కూడా తొలగించి సరికొత్త సరోద్ ను సృష్టించారు అమ్జద్ ఖాన్. సరోద్ వాయిద్యం ప్రస్తుతం ఇతర పాఠశాలల్లో కూడా ఉపయోగిస్తున్నారు.

ఉస్తాద్ అమ్జద్ ఖాన్ శాస్త్రీయ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతితో పాటు.. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. మన ప్రభుత్వం పద్మశ్రీ,  పద్మ భూషణ్ లను ఉస్తాద్ అమ్జద్ ఖాన్ కు అందించి సత్కరించింది.

1977లో అమ్జద్ అలీ ఖాన్ ఉస్తాద్ హఫీజ్ అలీ ఖాన్ మెమోరియల్ సొసైటీని స్థాపించారు.  ఇది కచేరీలను నిర్వహిస్తుంది. అంతేకాదు మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ శాస్త్రీయ సంగీతకారులకు ఏటా హఫీజ్ అలీ ఖాన్ అవార్డును ప్రదానం చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..