Andhra Pradesh: ఎనిమిదేళ్ల చిన్నారి కడతేర్చిన తల్లిదండ్రులు.. భార్యాభర్తల మధ్య గొడవలే కారణం అంటున్న స్థానికులు
కన్నవాళ్లే మానవత్వం, కన్నప్రేమ మరచి బిడ్డల పట్ల కసాయివాళ్లుగా మారుతున్నారు. అన్నెం పుణ్ణెం ఎరుగని పసివాళ్లను పొట్టనపెట్టుకుంటున్నారు. ఇటువంటి దారుణ ఘటన తాజాగా ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది.
కోపంతో చేసే పనులు వివాదాలు ప్రాణాలను తీసుకునే వరకూ లేదా ఇతరుల ప్రాణాలను తీసే వరకూ వెళ్తున్నాయి. ముఖ్యంగా భార్యభర్తల మధ్య గొడవలు జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. క్షణికావేశంతో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు పిల్లలపాలిట శాపాలుగా మారుతున్నాయి. కన్నవాళ్లే మానవత్వం, కన్నప్రేమ మరచి బిడ్డల పట్ల కసాయివాళ్లుగా మారుతున్నారు. అన్నెం పుణ్ణెం ఎరుగని పసివాళ్లను పొట్టనపెట్టుకుంటున్నారు. ఇటువంటి దారుణ ఘటన తాజాగా ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది.
కడప జిల్లాలో ఎనిమిదేళ్ల చిన్నారిని కన్నతల్లిదండ్రులే కడతేర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెండ్లిమర్రి మండలం మాచునూరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పది.. తమ ఎనిమిదేళ్ల కన్నబిడ్డను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపేశారు. అనంతరం రక్తపు మడుగులో చిన్నారిని వదిలేసి ఇద్దరూ పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. భార్యాభర్త మద్య గొడవే ఈ హత్యకు కారణంగా స్దానికులు పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..