AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padmasri Award: సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రకాష్ చంద్రసూద్‌ను వరించిన పద్మం.. అభినందనల వెల్లువ

పుట్టపర్తి సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రకాష్ చంద్రసూద్ ను పద్మశ్రీ అవార్డ్ వరించింది. ఆచార్యులుగా పని చేస్తున్న చంద్ర సూద్ సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. అభినందనలు తెలిపిన సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు.

Padmasri Award: సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రకాష్ చంద్రసూద్‌ను వరించిన పద్మం.. అభినందనల వెల్లువ
Chandra Prakash Sood
Surya Kala
|

Updated on: Jan 26, 2023 | 8:41 AM

Share

భారత దేశ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.  ఈ ఏడాది ప్రతిష్టాత్మక  అవార్డులు ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడుగురు అందుకోనున్నారు. వారిలో ఒకరు.. పుట్టపర్తి సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేస్తున్న ప్రకాష్ చంద్ర సూద్.

పుట్టపర్తి సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రకాష్ చంద్రసూద్ ను పద్మశ్రీ అవార్డ్ వరించింది. 1998 నుంచి ఇప్పటి వరకూ యూనివర్శిటీలో ఆచార్యులుగా పని చేస్తున్న చంద్ర సూద్ సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. అభినందనలు తెలిపిన సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు. ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జె. రత్నాకర్, విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. పంజాబ్ లో 1928లో సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం పంజాబ్ లో కొనసాగించి, అమెరికాలో పీహెచ్డీ చేశారు.1969 నుంచి 1988 వరకు వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. 1988లోనే పదవీ విరమణ పొందారు.

ముంబయిలోని బాబా అణుపరిశోధన కేంద్రంలో పనిచేశారు. సత్యసాయిబాబా సూచన మేరకు 1998 నుంచి సత్యసాయి విశ్వవిద్యాలయంలో విద్యాబో ధనతోపాటు పరిశోధన అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ప్రత్యే కంగా న్యూక్లియర్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ రంగంలో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన భారతదేశంలోని అత్యంత సీనియర్ అణుశాస్త్రవేత్తలలో ఒకరు. భార్య ఉషారాణితో పాటు ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రస్తుతం కుమారుడితో కలిసి ముంబాయిలో ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..