Viral Wedding Card : వావ్‌.. వాటే క్రియేటివిటీ.. ఇలాంటి పెళ్లి కార్డు మీరెప్పుడైనా చూశారా..? తీసుకోవాలంటే మొహమాటమే..!

పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక‌.. ఇత‌ర కార్య‌క్ర‌మాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది.

Viral Wedding Card : వావ్‌.. వాటే క్రియేటివిటీ.. ఇలాంటి పెళ్లి కార్డు మీరెప్పుడైనా చూశారా..? తీసుకోవాలంటే మొహమాటమే..!
Viral Wedding Card
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 26, 2023 | 9:50 AM

ఇంటర్‌నెట్‌ వినియోగం విచ్చలవిడిగా మారిపోయింది. సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రమైన పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అదే తరహాలో ఒక వెడ్డింగ్ కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లి శుభలేఖ వైరల్‌ కావటం ప్రస్తుత కాలంలో మామూలే అయిపోయింది. ఎందుకంటే.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. కొత్త త‌ర‌హాలో ఆలోచిస్తోంది యువతరం.. ముఖ్యంగా తమ పెళ్లి విష‌యంలో మరింత క్రియేటివిటీని యాడ్ చేసుకుంటున్నారు. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక‌.. ఇత‌ర కార్య‌క్ర‌మాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఏడిద వెంకటేష్‌.. తన చిన్న కుమార్తె పెళ్లికి రెండు వేల రూపాయల నోటు తరహాలో శుభలేఖ అచ్చు వేయించారు. చిన్న పరిమాణంలోనే.. 2 వేల రూపాయల నోటును పోలినట్లుగా తయారు చేయించిన ఈ పెళ్లి కార్డు అందరినీ ఆకట్టుకుంటోంది..కరెన్సీ నోటుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ లవ్‌ అనే పదం చేర్చారు. వివాహ బంధంతో ఒక్కటవుతున్నాం.. చివరి శ్వాసవరకూ కలసి ఉంటామంటూ కార్డుపై ప్రస్తావించారు. అలాగే నోటుకు మరోవైపు వివాహానికి సంబంధించి వివరాలు ముద్రించారు.

ఇవి కూడా చదవండి
Wedding Card

ఈ వెరైటీ శుభలేఖల్ని బంధువులు, స్నేహితులకు అందిస్తుంటే.. నిజంగా రెండు వేల నోటు అనుకుని తీసుకునేందుకు మొహమాటపడ్డారు. ఆ తర్వాత 2వేల నోటును పోలి ఉన్న శుభలేఖేనని తెలుసుకుని.. వాళ్ల క్రియేటివీటీకి ఫిదా అయ్యారు. అంతేకాదు 2017లో వెంకటేష్‌ తన పెద్ద కుమార్తె పెళ్లికి బ్యాంక్‌ ఏటీఎం కార్డు తరహాలో శుభలేఖను తయారు చేయించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి