నైజీరియాలో బాంబు పేలుడు.. పదుల సంఖ్యలో పశువుల కాపరులు మృతి.. మంటల్లో మూగజీవాలు..

ఫులానీ పశువుల కాపరులు తమ పశువులను బెన్యూ నుండి నసరవాకు తరలిస్తున్నారని, అక్కడ మేత వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించినందుకు అధికారులు జంతువులను జప్తు చేశారని చెప్పారు.

నైజీరియాలో బాంబు పేలుడు.. పదుల సంఖ్యలో పశువుల కాపరులు మృతి.. మంటల్లో మూగజీవాలు..
Bomb Blast
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 26, 2023 | 9:06 AM

నైజీరియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ నైజీరియాలో బాంబు పేలుడు సంభవించింది. ఉత్తర నైజీరియా సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 27 మందికి పైగా మరణించినట్టు సమాచారం. నైజీరియాలోని బౌచి సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. కాగా.. మరణించిన వారిలో ఎక్కువ మంది పశువుల కాపరులే ఉన్నారు. బాంబ్‌ బ్లాస్ట్‌లో పశువులు కూడా చనిపోయినట్టు నైజీరియా ప్రభుత్వ ప్రతినిధి, జాతీయ పశువుల పెంపకందారుల ప్రతినిధి వెల్లడించారు. నసరవా, బెన్యూ రాష్ట్రాల మధ్య బాంబు పేలుడు సంభవించింది. నైజీరియాకు చెందిన మియాతి అల్లా పశువుల పెంపకందారుల సంఘం ప్రతినిధి తసియు సులైమాన్ మాట్లాడుతూ.. ఫులానీ పశువుల కాపరులు తమ పశువులను బెన్యూ నుండి నసరవాకు తరలిస్తున్నారని, అక్కడ మేత వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించినందుకు అధికారులు జంతువులను జప్తు చేశారని చెప్పారు. ఘటనా స్థలంలో మరింత మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పేలుడు మూలాన్ని పోలీసు బాంబు నిపుణులు విచారిస్తున్నారని మహ్మద్ బాబా చెప్పారు.

పశువుల కాపరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బృందంలోని సభ్యుడు సైనిక దాడి కారణంగా పేలుడు సంభవించినట్లు సమాచారం. నైజీరియా వైమానిక దళం ప్రతినిధి ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ నైజీరియాలో పశువుల కాపరులు, రైతులు తమ పశువులకు ఆహారం, నీరు అందించటానికి కూడా కష్టపడుతున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో జాతి, మతపరమైన కోణాన్ని సంతరించుకుంది.

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?