Watch Video: బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన కుక్కపిల్ల.. ధృవీకరణ పత్రంలో సంతకం ఎలా చేసిందో తెలుసా..?
అందమైన జంతువుల వీడియోలను ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికోసమే ఈ వీడియో.. మీరు కూడా ఈ వీడియోను చూస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ మనోహరమైన వీడియో మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఈ వీడియోలో నవజాత కుక్కపిల్ల తన జనన ధృవీకరణ పత్రంపై సంతకం చేసింది. అది ఎలా సాధ్యం అని మీరు ఆశ్చర్యపోతున్నారా..? కుక్కపిల్ల తన యజమాని సహాయంతో జనన ధృవీకరణ పత్రంలో పాద ముద్రలను వేసింది. […]
అందమైన జంతువుల వీడియోలను ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికోసమే ఈ వీడియో.. మీరు కూడా ఈ వీడియోను చూస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ మనోహరమైన వీడియో మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఈ వీడియోలో నవజాత కుక్కపిల్ల తన జనన ధృవీకరణ పత్రంపై సంతకం చేసింది. అది ఎలా సాధ్యం అని మీరు ఆశ్చర్యపోతున్నారా..? కుక్కపిల్ల తన యజమాని సహాయంతో జనన ధృవీకరణ పత్రంలో పాద ముద్రలను వేసింది. వీడియోను లాడ్‌బిబుల్ షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోకి 5.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కామెంట్ బ్లాక్ పూర్తిగా సంతోషకరమైన వ్యాఖ్యలతో నిండిపోయింది. ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో… అప్పుడే పుట్టిన కుక్కపిల్లకు బర్త్ సర్ట్‌ఫికెట్ తీసుకుంటున్నారు దాని యజమాని. అందుకోసం ఆ చిన్నిబుజ్జి కుక్కపిల్ల పాదాలతో తన బర్త్ సర్టిఫికెట్‌పై సంతకం చేయించారు. ఈ బుజ్జి కుక్కపిల్లకు అలెక్స్ అని పేరు పెట్టారు. దాని పేరు, దాని తల్లిదండ్రుల పేర్లతో పాటు కుక్కపిల్ల పుట్టిన తేదీతో జనన ధృవీకరణ పత్రంపై ముద్రించారు. యజమాని చిన్న కుక్కపిల్లను పట్టుకొని సర్టిఫికేట్‌పై పప్పి పాదాలతో ముద్రవేయించాడు. బుజ్జి డాగ్ పాదముద్ర ప్రింట్లు చూడముచ్చటగా కనిపించాయి. ఇకపోతే, ఈ కుక్కపిల్ల గ్రేహౌండ్ జాతికి చెందిన ఫీమేల్ డాగ్ అని తెలిసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో హల్‌చల్ చేస్తోంది..
View this post on Instagram
ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో మన అందరి అలసటను తొలగిస్తుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు జంతుప్రేమికులు స్పందిస్తూ.. దాని కాళ్లకు పూసిన మసి దాని చర్మానికి హానికరం కాదా? అని అడుగుతున్నారు. రీల్స్ కోసం ప్రజలు ఏమైనా చేస్తారు. కుక్కలకు కూడా వారి స్వంత వ్యక్తిత్వం ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు?
మరన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..