ఇదో వింత ఘటన.. వేటకు వెళ్లిన వ్యక్తిని కాల్చి చంపిన పెంపుడు కుక్క.. !

కుక్క తుపాకీ పట్టుకుని కాల్చడం ఎలా అని ఆశ్చర్యపోతున్నారా..? కారులో ముందు సీట్లో కూర్చున్న ఓ యువకుడికి వెనుక వైపు నుంచి నేరుగా బుల్లెట్లు తగలడంతో చనిపోయాడు.

ఇదో వింత ఘటన.. వేటకు వెళ్లిన వ్యక్తిని కాల్చి చంపిన పెంపుడు కుక్క.. !
Pet Dogs
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 25, 2023 | 2:06 PM

కుక్క తుపాకీ పట్టుకుని కాల్చడం ఎలా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును .. అమెరికాలో పెంపుడు కుక్క ఓ వ్యక్తిని కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో పెంపుడు కుక్క 30 ఏళ్ల వ్యక్తిని చంపిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్క ప్రమాదవశాత్తూ వెనుక సీట్లో ఉన్న తుపాకీని తొక్కడంతో ఒక్కసారిగా గన్‌ పేలి కాల్పులు జరిగాయి. దీంతో ముందు సీట్లో కూర్చున్న ఓ యువకుడికి వెనుక వైపు నుంచి నేరుగా బుల్లెట్లు తగలడంతో చనిపోయాడు. కుక్క తుపాకీని తొక్కడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందని, ప్రాథమిక విచారణలో వేటకు వెళ్లినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. కాగా, చనిపోయిన యువకుడు కుక్క యజమాని అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

అయితే, ఇది హత్యేనని, కుక్క పేరు చెప్పి తప్పుదారి పట్టించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ, వారికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. 2018లో మెక్సికోలో ఇలాంటి ఘటనే జరిగింది. వేటకు వెళ్లిన పెంపుడు కుక్క ప్రమాదవశాత్తు వీపుపైకి దూసుకెళ్లడంతో యజమాని మృతి చెందాడు.

అమెరికాలో ప్రమాదవశాత్తు కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చట్టబద్ధత కారణంగా అమెరికాలో తుపాకీ యజమానుల సంఖ్య పెరిగింది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, 2021లో ప్రతి సంవత్సరం 500 మంది షూటింగ్ సంబంధిత సంఘటనలలో మరణిస్తున్నట్టు అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి