Meditation: రోజులో పది నిమిషాలు మౌనంగా ఉండడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
మనతో మనం మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మనం ధ్యానం చేస్తాము. ఇది మన మనస్సును ప్రశాంతపరుస్తుంది. మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది.
పెద్ద పెద్ద శబ్ధాలు, గట్టిగట్టిగా అరుచుకోవటం మన శరీరంతో పాటు మన మనస్సు, మెదడును ప్రభావితం చేస్తుంది. ఇది మన ఒత్తిడిని పెంచుతుంది. అలాంటి పరిస్థితుల్లో రోజుకు కనీసం పది నిమిషాల పాటు మౌనంగా ఉండటం ద్వారా మన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ఒక గొప్ప మార్గం. ప్రతి మతం, సంస్కృతిలో, ప్రశాంతంగా,నిశ్శబ్దంగా ఉండటానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. కొంతమంది దీనికి మతపరమైన పేరు పెట్టారు. కొందరు దీనిని జీవన విధానంగా భావిస్తారు. కానీ, పగటిపూట కొంతసేపు ప్రశాంతంగా ఉండటం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని రుజువు చేస్తుంది. చాలా మంది మనస్తత్వవేత్తలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఏకాగ్రతను పెంచడానికి, మనశ్శాంతిని, సానుకూల ఆలోచనను పెంచడానికి ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు మౌనంగా ఉండాలని లేదా నిశ్చలంగా ఉండాలని సూచిస్తున్నారు. మనం కొంత సమయం మౌనంగా ఉన్నప్పుడు, మనతో మనం మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మనం ధ్యానం చేస్తాము. ఇది మన మనస్సును ప్రశాంతపరుస్తుంది. మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది.
మౌనంగా చేసే ధ్యానం మన మెదడుకు కొత్త శక్తిని ఇస్తుంది. ఇది మన మనస్సును ప్రశాంతపరుస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుతుంది. ఒత్తిడిని పెంచే ‘హార్మోన్ల’ స్థాయిని తగ్గిస్తుంది. కొంతసమయం పాటు మౌనంగా ఉండటం వల్ల మన మెదడు కణాలను పునరుత్పత్తి చేస్తుంది. వాటి పునర్నిర్మాణం మన మెదడు శక్తిని పెంచుతుంది. దీంతో మన ఏకాగ్రత పెరిగి మెదడుకు పదును పెడుతుంది. ప్రస్తుత ఒత్తిడి జీవితంలో ధ్యానం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వుంది. ఆందోళన, ఒత్తిడి ఇతర మానసిక సమస్యల నుంచి బయిటపడేందుకు మౌనంగా ఉండటం ఉత్తమం. మౌనంగా చేసే ధ్యానంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రతిరోజూ ధ్యానం చేయడంతో ఒత్తిడిని జయించవచ్చు. ఒత్తిడి నుంచి దూరంగా ఉండడంతో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆందోళన దూరం అవుతుంది. ప్రతిరోజూ ధ్యానం చేయడంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. భయం, ఆందోళన, ఉద్రిక్తతలను దూరం చేసుకోవచ్చు. రక్తపోటు సమస్య నుంచి బయిట పడేందుకు ప్రతిరోజూ ధ్యానం చేయడం ఎంతో ఉత్తమం. సంతులిత ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం, ధ్యానం చేయడంతో అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ 30 నిమిషాలు ధ్యానం చేయడంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ధ్యానంతో నిద్రలేమి సమస్యతో ఉపశమనం కలుగుతుంది. ధ్యానం చేయడంతో అన్ని కంటే ముఖ్యంగా అత్మవిశ్వాసం మెరుగుపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…