AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ.. ఇదేం యాడ్‌రా బాబు.. బక్కెట్‌ అమ్ముకోవటానికి బాలకృష్ణ సినిమా చూపించేశారుగా..!

మన తెలుగు సినిమాల్లో కార్లు, జీపులు ఎలాగైతే గాల్లోకి ఎగురుతాయో అచ్చం అలాగే ఈ బక్కెట్‌ యాడ్‌లో హీరో కూడా ఒక్క బక్కెట్‌తో రౌడీల భరతం పట్టాడు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

Viral Video: వార్నీ.. ఇదేం యాడ్‌రా బాబు..  బక్కెట్‌ అమ్ముకోవటానికి బాలకృష్ణ సినిమా చూపించేశారుగా..!
Bucket Companys Ad
Jyothi Gadda
|

Updated on: Jan 26, 2023 | 10:24 AM

Share

ఏదైనా ఒక ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించాలంటే దానికి ప్రచారం చాలా ముఖ్యం.. వినూత్నమైన మార్కెటింగ్ ఆలోచనతో వ్యాపారం చేయటం చాలా కష్టం. ప్రత్యేకించి ఇతర బ్రాండ్‌ల నుండి చాలా పోటీ ఉన్నప్పుడు, కంపెనీలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు తగినంత లాభదాయకంగా మార్చడానికి నెక్ట్స్‌ లెవల్లో ఆలోచించి ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, బంగ్లాదేశ్ ప్లాస్టిక్ బ్రాండ్, RFL క్రియేటి విటీ టీమ్ చేసిన ఐడియా అదరహో అంటోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ప్రచార ప్రకటన ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్ర ఈ వైరల్‌ వీడియోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. వీడియోలో బంగ్లాదేశీ ప్లాస్టిక్ బ్రాండ్ ఆర్ఎఫ్ఎల్ బ‌కెట్ ఇన్నోవేటివ్ యాడ్‌లో హీరో స‌ద‌రు కంపెనీకి చెందిన రెడ్ బ‌కెట్ చేతిలో పట్టుకుని విల‌న్ గ్యాంగ్‌పై విరుచుకుప‌డ‌టం క‌నిపిస్తుంది. మన తెలుగు సినిమాల్లో కార్లు, జీపులు ఎలాగైతే గాల్లోకి ఎగురుతాయో అచ్చం అలాగే ఈ బక్కెట్‌ యాడ్‌లో హీరో కూడా ఒక్క బక్కెట్‌తో రౌడీల భరతం పట్టాడు.. బక్కెట్‌తో కొడితే రౌడీల వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేచి పేలిపోయింది. వీడియో చివ‌రిలో ఫైటింగ్‌ పూర్తి అవ్వగానే హీరో బ‌య‌ట‌కు వ‌స్తూ త‌న బ‌కెట్ వెప‌న్‌కు థ్యాంక్స్ చెబుతాడు. ప్రోడ‌క్ట్ గురించిన వివ‌రాల‌తో యాడ్ ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక, ఈ బంగ్లాదేశ్‌ బ‌కెట్ పేరు యూనిక్ కాగా, అత్యంత ధృడ‌మైన బ‌కెట్ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇప్పటికే 30,000కు పైగా వ్యూస్‌, వేల సంఖ్యలో లైకులు సాధించింది. ఇక యాడ్‌ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు