Pawan Kalyan: దుర్గమ్మ సన్నిధిలో పవన్ కల్యాణ్.. రాక్షస పాలన అంతమొందించేలా దీవించాలని వారాహికి పూజలు
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో తన ఎన్నికల ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారాయన. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమన్నారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వీరికి దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం ద్వారా అమ్మవారిని దర్శించుకున్న పవన్ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితులు జనసేనానికి ఆశీర్వచనం అందజేశారు.
కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు పవన్ కల్యాణ్. ‘దుర్గాదేవి ని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఇన్నేళ్లలో తల్లి నుంచి పిలుపురాలేదు. ఇవాళ తల్లి దుర్గమ్మ పిలిపించుకొని ఆశీస్సులు అందజేసింది. నిన్న కొండగట్టులో వారాహి పూజను నిర్వహించాం. ఇవాళ దుర్గమ్మ చెంత వారాహికి పూజలు నిర్వహిస్తున్నాం’ అని పవన్ పేర్కొన్నారు. పవన్ రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైనా కిందా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
మరిన్నీ ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..