TSPSC Group-3 Syllabus: నిరుద్యోగులకు అలర్ట్! టీఎస్పీయస్సీ గ్రూప్‌-3 సిలబస్‌ విడుదల.. పూర్తి వివరాలివే..

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,365 గ్రూప్‌-3 సర్వీసు పోస్టులకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్పీయస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. వీటికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..

TSPSC Group-3 Syllabus: నిరుద్యోగులకు అలర్ట్! టీఎస్పీయస్సీ గ్రూప్‌-3 సిలబస్‌ విడుదల.. పూర్తి వివరాలివే..
Tspsc Group 1
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2023 | 7:37 PM

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,365 గ్రూప్‌-3 సర్వీసు పోస్టులకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్పీయస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. వీటికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వరకు కొనసాగనుంది. మొత్తం 26 ప్రభుత్వ విభాగాల్లో అత్యధిక ఉద్యోగాలు ఆర్థికశాఖలో ఉన్నాయి. రాత పరీక్ష ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనుంది. ఇక గ్రూప్‌ 3 పోస్టులకు సిలబస్‌ను టీఎస్పీయస్సీ తాజాగా విడుదల చేసింది.

టీఎస్పీయస్సీ గ్రూప్‌ 3 ఉద్యోగాలకు విద్యార్హతలు, వయో పరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో పాటు పరీక్ష సిలబస్‌ను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉండే ఈ పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహిస్తారా లేదా ఆఫ్‌లైన్‌లోనా అనేది అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు. పరీక్షకు ఏడు రోజుల ముందు హాల్‌ టికెట్లను విడుదల చేయనుంది.

టీఎస్పీయస్సీ గ్రూప్‌ 3 సిలబస్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.