AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parrot Arrested Liquor Case: అక్రమ మద్యం కేసులో చిలుక అరెస్ట్‌.. చిలుక స్వామిభక్తికి ఫిదా అవుతున్న నెటిజన్లు

లిక్కర్ మాఫియా కేసులో పోలీసులు ఓ రామచిలుకను అరెస్ట్‌ చేశారు. నిందితుల పెంపుడు చిలుకను విచారించడం ద్వారా కేసును ఛేదించేందుకు గయా పోలీసులు అత్యుత్యాహంతో చిలుకను అరెస్ట్‌ చేశారు. దీనికి..

Parrot Arrested Liquor Case: అక్రమ మద్యం కేసులో చిలుక అరెస్ట్‌.. చిలుక స్వామిభక్తికి ఫిదా అవుతున్న నెటిజన్లు
Parrot Arrested
Srilakshmi C
|

Updated on: Jan 26, 2023 | 6:43 PM

Share

లిక్కర్ మాఫియా కేసులో పోలీసులు ఓ రామచిలుకను అరెస్ట్‌ చేశారు. నిందితుల పెంపుడు చిలుకను విచారించడం ద్వారా కేసును ఛేదించేందుకు గయా పోలీసులు అత్యుత్యాహంతో చిలుకను అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులను ట్రోన్‌ చేయడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..

బీహార్‌లోని పాట్నాకు చెందిన గురువా పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ కన్హయ్య కుమార్‌కు అక్రమ మద్యం దందాపై సమాచారం అందింది. దీంతో పోలీసు బృందం అమృత్ మల్లాహ్‌ ఇంటిపై మంగళవారం రాత్రి దాడి చేశారు. ఐతే పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకునేలోపు అతని కుటుంబ సభ్యులందరూ అప్పటికే సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఐతే వారు పంజరంలో పెంచుకుంటున్న మాట్లాడే చిలుకను మాత్రం అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోలీసుల అలికిడిని పసిగట్టి చిలుక సూచనలు ఇవ్వడం వల్లే అమృత్ మల్లాహ్‌ తప్పించుకున్నాడని పోలీసులు భావించారు. దీంతో ఎస్‌ఐ కన్హయ్యకుమార్ చిలుకను పంజరంతో సహా పట్టుకొచ్చి స్టేషన్‌కు తీసుకొచ్చాడు. అనంతరం యజమాని గురించి చిలుకను ఇలా ప్రశ్నించాడు. ఏయ్‌ చిలుక అమృత్ మల్లా ఎక్కడికి పోయాడు? నీ యజమాని ఎక్కడ ఉన్నాడు? నిన్ను ఇంట్లో ఒంటరిగా ఎందుకు వదిలేశారు? అని ఎస్‌ఐ కన్హయ్య కుమార్‌ ప్రశ్నించారు. వెంటనే చిలుక ‘కటోరే-కటోరే’ అని అరిచింది. యజమాని గురించి ప్రశ్నిస్తే మాత్రం చిలుక మౌనంగా ఉంటోంది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో పోలీసులపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

కాగా బీహార్‌లో మద్యంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గత రెండేళ్లలో మద్యం చట్టాన్ని ఉల్లంఘించినందుకు దాదాపు 2.54 లక్షల మందికి పైగా అరెస్టు చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్