మీకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారా? ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతుంటే ఒకరి ఫీజు పూర్తిగా చెల్లించనున్న రాష్ట్ర సర్కార్

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 26, 2023 | 3:52 PM

ఆడపిల్లల తల్లిదండ్రులకు ఊరటనిచ్చే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇకపై ఇద్దరు ఆడపిల్లలను ఒకే ప్రైవేట్‌ స్కూల్‌లో చదివిస్తే.. వారిలో ఒకరికి పూర్తి ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు..

మీకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారా? ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతుంటే ఒకరి ఫీజు పూర్తిగా చెల్లించనున్న రాష్ట్ర సర్కార్
School Fee

ఆడపిల్లల తల్లిదండ్రులకు ఊరటనిచ్చే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇకపై ఇద్దరు ఆడపిల్లలను ఒకే ప్రైవేట్‌ స్కూల్‌లో చదివిస్తే.. వారిలో ఒకరికి పూర్తి ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అందుకు బడ్జెట్‌ కేటాయింపులు చేయాలని ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సైతం పంపింది. ప్రతిపాదన ఆమోదం పొందితే ఈ పథకం వల్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది బాలికలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద కోటి రూపాయల టోకెన్‌ను అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిమాండ్ పెరిగే కొద్దీ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మొత్తం ఇవ్వబడుతుంది. టోకెన్ మొత్తాన్ని ఇవ్వడం ద్వారా, ఆర్థిక నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేస్తారు.

ప్రభుత్వ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. 2024లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల బడ్జెట్‌ను గణనీయంగా పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రహదారులను కనీసం 7 మీటర్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరం పూర్తి చేసి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే కొత్త పనులకు అధికమొత్తంలో బడ్జెట్‌ కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. అలాగే నీటిపారుదల శాఖ, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి పలు కొత్త పథకాలకు కూడా నిధులు మంజూరు చేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ.7 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu